త‌ల్లి కాబోతున్న విష‌యాన్ని వెల్ల‌డించిన టీవీ యాంక‌ర్

Sat,February 16, 2019 12:26 PM
Lasya Manjunath announces pregnancy with an adorable post

చ‌లాకీ మాట‌ల‌తో బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి హుషారెత్తించే లాస్య ఫిబ్ర‌వ‌రి 15,2017న మంజునాథ్‌ని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారం త‌మ‌ రెండో వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ కావ‌డంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌ను త‌ల్లి కాబోతున్న విష‌యాన్ని తెలిపింది లాస్య‌. జీవితంలో ఎన్నో ఆస‌క్తిక‌ర అంశాల‌ని చూశాము. సెకండ్ యానివ‌ర్స‌రీ సంద‌ర్భంగా నేను త‌ల్లి కాబోతున్నాన్ననే విష‌యాన్ని మీతో షేర్ చేసుకోవాల‌నుకున్నాను. లిటిల్ హ‌నీ త్వర‌లోనే మాతో క‌ల‌వ‌నున్నాడు. అప్పుడు మా ఫ్యామిలీ ముగ్గురం అవుతాము అని పేర్కొంది. యూ ట్యూబ్ లోను తాను త‌ల్లి కాబోతున్న విష‌యాన్ని తెలిపిన లాస్య త‌న‌కు బాబు కావాల‌నుంద‌ని తెలిపింది. ప్ర‌స్తుతం 8వ నెల న‌డుస్తుంద‌ని కూడా అన్న‌ది. యాంక‌ర్‌గా అల‌రించిన లాస్య రాజా మీరు కేక అనే చిత్రంతో వెండితెర ఎంట్రీ కూడా ఇచ్చింది. ఈ మూవీ డివైడ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికి , లాస్య న‌ట‌న‌కి మంచి ప్ర‌శంస‌లు ల‌భించాయి. లాస్య గ‌తంలో త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా భ‌ర్త ఇచ్చిన పప్పీ ఫోటోల‌ని ఫేస్ బుక్‌లో షేర్ చేస్తూ.. పెళ్ళి త‌ర్వాత , నా భ‌ర్త నుండి అందుకున్న తొలి గిఫ్ట్ కూడా ఇదేన‌ని స్ప‌ష్టం చేసింది.

5985
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles