లాంబోర్గిని, ఫెరారీ, ఆస్టన్‌మార్టిన్.. ల‌గ్జ‌రీ కార్లు ధ్వంసం

Tue,May 29, 2018 10:01 AM
Lamborghini, Ferrari, Aston Martin cars destroyed while filming Race 3

హైదరాబాద్: కార్ లవర్స్‌ను రేస్-3 ఫిల్మ్ థ్రిల్ చేయడం ఖాయం. ఈ ఫిల్మ్ కోసం భారీ యాక్షన్ సీన్లను తీశారు. దాని కోసం టాప్ హై హెండ్ లగ్జరీ కార్లను వాడారు. ఆస్టన్ మార్టిన్, మసరేటి, ఫెరారీ, లాంబోర్గినీ లాంటి ఖరీదైన కార్లను ధ్వంసం చేశారు. మేటి లగ్జరీ కార్లతో ఫిల్మ్‌లో అనేక సీన్లను షూట్ చేశారు. సల్మాన్, బాబీ డియోల్, అనిల్ కపూర్ నటిస్తున్న రేస్-3 సినిమాను రెమో డిసౌజా డైరక్ట్ చేస్తున్నాడు. ట్రైలర్ ఆవిష్కరణ సమయంలోనూ సల్మాన్.. ఈ ఫిల్మ్‌లో వాడిన కార్ల గురించి ఓ కామెంట్ చేశారు. ఖరీదైన కార్లను ధ్వంసం చేయడం బాధ కలిగించిందన్నాడు. రేస్3 కోసం సుమారు 15 కార్లను నాశనం చేసినట్లు హీరో అనిల్ కపూర్ తెలిపాడు. మాడ్రన్ టెక్నాలజీతో సినిమాను షూట్ చేశారు. కార్ సీన్స్‌ను మరింత రక్తి కట్టించేందుకు.. ఫార్ములా వన్ ట్రాక్‌పై ఆ సీన్లను తీసినట్లు నిర్మాతలు చెప్పారు. రేస్ సీక్వెల్‌లో వస్తున్న రేస్3లో యాక్షన్, సస్పెన్స్ ఎక్కువగా ఉంటుందన్నారు. థాయ్‌ల్యాండ్, అబుదాబి, ముంబై నగరాల్లో యాక్షన్ సీన్లను షూట్ చేశారు. ఫుల్ స్టంట్స్‌తో ఉన్న ట్రైలర్ ఇప్పటికే సినీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నది. ఈ ఏడాది ఈద్ సందర్భంగా సినిమాను రిలీజ్ చేయనున్నారు.

2104
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS