లక్ష్మీస్ వీరగ్రంథం టీజ‌ర్ విడుద‌ల‌

Wed,March 13, 2019 08:41 AM
Lakshmis veeragrandham Movie Teaser released

ఎన్టీఆర్ జీవిత నేప‌థ్యంలో తమిళ నాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతి రెడ్డి జగదీశ్వర్ రెడ్డి ల‌క్ష్మీస్ వీర‌గ్రంథం అనే ప్రాజెక్ట్ తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ చిత్రంలోని కీల‌క స‌న్నివేశాల‌ని బెంగుళూరులో చిత్రీక‌రిస్తున్నారు. అయితే తాజాగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో ల‌క్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఇంటి గ‌డ‌ప తొక్కుతున్న‌ట్టుగా చూపించారు. ఆ స‌మ‌యంలో తెలుగింటి గ‌డ‌ప‌పై విర‌జిమ్మిన విష‌యం అనే క్యాప్ష‌న్ కూడా ఇచ్చారు. ఎన్టీఆర్ జీవితంలోకి ల‌క్ష్మీ పార్వ‌తి వ‌చ్చిన త‌ర్వాత ఏం జ‌రిగింది అనే దానిని ఈ సినిమాలో చూపించ‌నున్న‌ట్టు టీజ‌ర్‌ని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది.

ఎన్టీఆర్ జీవితంలో జరిగిన అత్యంత కీలకమైన సంఘటలను చిత్రీకరిస్తున్నాం. ఎన్టీఆర్ తుది దశలో ఎదుర్కొన్న అత్యంత అవమానకరమైన, కీలకమైన సన్నివేశాలను జనరంజకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సినిమా ఎవరినీ ఉదేశించి తీయడం లేదు అని కేతిరెడ్డి అన్నారు. ఏప్రిల్ తొలి వారంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. నాగరుషి ఫిలిమ్స్ సమర్పణలో, జయం మూవీస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో ల‌క్ష్మీ పార్వ‌తిగా శ్రీ రెడ్డి న‌టిస్తున్న‌ట్టు తెలుస్తుంది. అయితే తాజాగా విడుద‌లైన టీజ‌ర్‌ని చూస్తుంటే వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సంబంధించి విడుద‌ల చేసిన తొలి పోస్ట‌ర్ మాదిరిగానే అనిపిస్తుంది. కాక‌పోతే ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌లో ల‌క్ష్మీ పార్వ‌తికి సంబంధించిన పాజిటివ్ అంశాల‌ని వ‌ర్మ చూపించ‌నుండ‌గా, నెగెటివ్ అంశాల‌ని ల‌క్ష్మీస్ వీర‌గ్రంథంలో చూపించ‌నున్నార‌ని అంటున్నారు.

వీరగ్రంథం వెంకట సుబ్బారావు జీవితంలోకి అడుగుపెట్టిన లక్ష్మీపార్వతి .. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించడం .. ఆ తరువాత ఏర్పడిన రాజకీయ సంక్షోభం గురించి ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రం ఓ దృశ్య కావ్యంగా ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు అంటున్నారు.

3027
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles