ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర ట్రైల‌ర్‌కి ముహూర్తం ఫిక్స్ చేసిన వ‌ర్మ‌

Sun,February 10, 2019 07:54 AM
Lakshmis Ntr trailer release date fixed

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అనే చిత్రం తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ల‌క్ష్మీ పార్వ‌తి దృష్టి కోణం నుండి ఎన్టీఆర్ జీవితంకి సంబంధించిన వివ‌రాల‌ని ఇందులో చూపించ‌నున్నాడ‌ట‌. చిత్రానికి సంబంధించి ప‌లు పోస్ట‌ర్స్ విడుద‌ల చేసిన వ‌ర్మ పాత్ర‌ల పేర్లు చెప్ప‌కుండానే మూవీపై మ‌రింత ఆస‌క్తి పెంచుతున్నాడు. అయితే చిత్ర ట్రైల‌ర్‌ని మ‌హానాయ‌కుడు మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రోజు విడుద‌ల చేస్తాన‌ని చెప్పిన వ‌ర్మ ముందుగానే ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ట్రైల‌ర్‌కి ముహూర్తం ఫిక్స్ చేశాడు. ‘ఎన్టీఆర్, లక్ష్మీపార్వతుల అత్యంత డైనమిక్ లవ్ స్టోరీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ట్రైలర్‌ను ఫిబ్రవరి 14, వాలెంటైన్స్ డే రోజున ఉదయం 9.27 గంటలకు జీవీ ఫిలిమ్స్ సంస్థ విడుదల చేయనుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ కృతజ్ఞతలేని, అవిశ్వాసవంతమైన కుటుంబసభ్యులు, వెన్నుపోటు పొడిచి మోసం చేసిన వాళ్ల కథల కలయిక. అసలైన కథని తెలుసుకొనేందుకు సిద్ధంగా ఉండండి’’ అంటూ వర్మ ట్వీట్ చేశారు. చిత్రంలో యజ్ఞాశెట్టి ‘లక్ష్మీపార్వతి’ పాత్రలో నటిస్తోండ‌గా, ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రంగస్థల కళాకారుడు న‌టిస్తున్నాడు . ఇక చంద్రబాబు పాత్రలో వంగవీటి సినిమాలో దేవినేని నెహ్రూగా నటించిన శ్రీతేజ్ నటిస్తున్నారు. కళ్యాణ్ మాలిక్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

2228
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles