ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Wed,February 27, 2019 10:52 AM
Lakshmis Ntr release date fixed

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్. ఈ చిత్రంలో నంద‌మూరి తార‌కరామారావు జీవితాన్ని ల‌క్ష్మీ పార్వ‌తి దృష్టి కోణంలో చూపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ రాజ‌కీయ జీవితంతో పాటు ల‌క్ష్మీ పార్వ‌తి ఆయ‌న జీవితంలోకి వ‌చ్చిన త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌న్నింటిని క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్టు చూపించ‌నున్నాడ‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కు చిత్రానికి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్‌, టీజ‌ర్, ట్రైల‌ర్‌కి భారీ ఆద‌ర‌ణ ల‌బించ‌డంతో చిత్రం కూడా మంచి హిట్ అవుతుంద‌ని టీం భావిస్తుంది. అయితే చిత్రాన్ని మార్చి 15న విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న కూడా చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ జీవిత నేప‌థ్యంలో వ‌చ్చిన క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు చిత్రాలు అంత‌గా అల‌రించ‌క‌పోవ‌డంతో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌పై అభిమానుల‌లో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. చిత్రంలో యజ్ఞాశెట్టి ‘లక్ష్మీపార్వతి’ పాత్రలో నటిస్తోండ‌గా, ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రంగస్థల కళాకారుడు న‌టిస్తున్నాడు . ఇక చంద్రబాబు పాత్రలో వంగవీటి సినిమాలో దేవినేని నెహ్రూగా నటించిన శ్రీతేజ్ నటిస్తున్నారు.

3818
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles