ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కొత్త పోస్ట‌ర్స్‌

Tue,October 17, 2017 04:25 PM
LAKSHMIS NTR new posters shared by rgv

సంచ‌ల‌న దర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ .. ఎన్టీఆర్ జీవిత నేప‌థ్యంలో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సినిమా చేస్తాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి రాకేష్ రెడ్డి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా, కాస్ట్ అండ్ క్రూ విష‌యంకి సంబంధించి త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి రోజుకో ప్ర‌క‌ట‌న చేస్తున్న వ‌ర్మ తాజాగా త‌న ఫేస్ బుక్ పేజ్‌లో రెండు పోస్ట‌ర్స్ పోస్ట్ చేశాడు. అందులో ఒక‌టి ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్ అని పోస్ట్ చేయగా, మ‌రొక పిక్ కి ఎలాంటి కామెంట్ పెట్ట‌కుండానే పోస్ట్ చేశాడు. ఇందులోని రెండు ఫోటోల‌ని గ‌మనిస్తే, ఆర్జీవి ఇన్‌డైరెక్ట్‌గా ఏం చెప్ప‌బోతున్నాడ‌నేది మ‌న‌కి అర్ధం అవుతుంది. ఎన్టీఆర్‌, ల‌క్ష్మీ పార్వ‌తి పెళ్లి ఫోటోని మొద‌ట పోస్ట్ చేసిన ఆర్జీవి, ఆ త‌ర్వాత ఎన్టీఆర్ మ‌ర‌ణించిన త‌ర్వాత ల‌క్ష్మీ పార్వ‌తి క‌న్నీరు పెడుతున్న పిక్‌ని సినిమా పోస్ట‌ర్‌గా మ‌లిచి ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశాడు. ఈ రెండు పిక్స్‌లో ఇప్ప‌టి ఆంద్ర ప్ర‌దేశ్ సీఎం చంద్ర‌బాబు నాయుడు కూడా క‌నిపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ రెండు పోస్ట‌ర్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కాగా అభిమానులు విచిత్ర కామెంట్స్ పెడుతున్నారు. ఇటీవ‌ల ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఎన్టీఆర్ జీవితం మ‌హాభార‌తం వంటిది, అందులో ఒక అధ్యయ‌నాన్ని మాత్ర‌మే తెర‌కెక్కించబోతున్నాన‌ని వ‌ర్మ మీడియాకి తెలిపిన సంగ‌తి తెలిసిందే. 2018 ఫిబ్ర‌వరిలో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళి, అక్టోబ‌ర్ లో మూవీ రిలీజ్ చేస్తామ‌ని ఆయ‌న అన్నారు. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి, తాను చ‌నిపోయే వ‌ర‌కు ఏం జ‌రిగాయ‌నే విష‌యాల‌ని త‌న‌ సినిమాలో చూపిస్తాన‌ని వ‌ర్మ అన్నాడు .

3018
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS