వాడిని న‌మ్మ‌డమే చేసిన త‌ప్పు: ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైల‌ర్

Thu,February 14, 2019 10:01 AM
Lakshmis NTR Movie Trailer released

కాంట్ర‌వ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్‌ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవిత నేప‌థ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైల‌ర్ తాజాగా విడుద‌లైంది. ఇందులో ‘1989 ఎన్నికలలో ఎన్టీఆర్ దారుణంగా ఓడిపోయిన తరువాత రోజులవి’.. అంటూ ఓ కొటేష‌న్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆ త‌ర్వాత ఎన్టీఆర్‌, ల‌క్ష్మీ పార్వ‌తి మ‌ధ్య ఎమోష‌న‌ల్ సీన్స్.. జీవితం.. ఎప్పుడు.. ఎందుకు.. ఎలా.. మలుపు తిరుగుతుందో ఎవ్వరికి అర్థం కాదు అని ఎన్టీఆర్ అన‌డం.. త‌న ఫ్యామిలీ వేరే వారిని న‌మ్మ‌డం.. జీవితంలో చేసిన ఒకే ఒక్క త‌ప్పు వాడిని న‌మ్మ‌డం అని ఎన్టీఆర్ చెప్ప‌డం.. ఎన్టీఆర్‌ను చెప్పులతో కొట్టడం.. ల‌క్ష్మీ పార్వతికి తాళి క‌ట్ట‌డం లాంటి సన్నివేశాల‌ని ఈ ట్రైల‌ర్‌లో చూపించారు.

ఆద్యంతం ఆస‌క్తికరంగా ఉన్న ఈ ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాలు పెంచుతుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ కృతజ్ఞతలేని, అవిశ్వాసవంతమైన కుటుంబసభ్యులు, వెన్నుపోటు పొడిచి మోసం చేసిన వాళ్ల కథల కలయిక అని ఇప్ప‌టికే వ‌ర్మ ప్ర‌క‌టించ‌గా చిత్రానికి సంబంధించిన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ని ఫిబ్ర‌వ‌రి 22న విడుద‌ల చేయ‌నున్నారు. చిత్రంలో యజ్ఞాశెట్టి ‘లక్ష్మీపార్వతి’ పాత్రలో నటిస్తోండ‌గా, ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రంగస్థల కళాకారుడు న‌టిస్తున్నాడు . ఇక చంద్రబాబు పాత్రలో వంగవీటి సినిమాలో దేవినేని నెహ్రూగా నటించిన శ్రీతేజ్ నటిస్తున్నారు. కళ్యాణ్ మాలిక్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

6374
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles