'లక్ష్మీస్ ఎన్టీఆర్‌'పై ఫిలింనగర్‌లో నిషేధం

Wed,April 3, 2019 06:30 AM
Lakshmis NTR   movie special show stopped FNCC in Hyderabad

బంజారాహిల్స్: సెన్సార్ సర్టిఫికెట్ వచ్చి సినిమా విడుదలైనా, తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిషేధం విధించకపోయినా.. లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై మాత్రం జూబ్లీహిల్స్‌లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్‌ఎన్‌సీసీ) మాత్రం నిషేధం విధించింది. సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రదర్శించబోమని నిర్ణయం తీసుకున్నది.

కొత్తగా విడుదలైన సినిమాను ప్రతి శనివారం ఎఫ్‌ఎన్‌సీసీలో ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు. అది ఆనవాయితీగా వస్తున్నది. అందులో భాగంగానే ఎన్టీఆర్ జీవిత చరిత్రపై ఇటీవల విడుదలైన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలను ప్రదర్శించారు. కాగా ఆయన జీవిత చరిత్రపై వచ్చిన మరో సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను మాత్రం ఓ వర్గం వారు అడ్డుకున్నారు. తెలుగురాష్ర్టాల్లో విపరీతమైన ఆసక్తిని కలిగించిన ఈ సినిమాను తమ కోసం ప్రదర్శించాలని ఎఫ్‌ఎన్‌సీసీ సభ్యులు కోరుతున్నారు. దాంతో సినిమాను గత శనివారం ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న కొంతమంది ఓ వర్గానికి చెందిన వారు ఎట్టి పరిస్థితిలో ఆ సినిమాను ఎఫ్‌ఎన్‌సీసీలో ప్రదర్శించవద్దంటూ ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో క్లబ్ అధ్యక్షుడు సినిమా ప్రదర్శనకు అంగీకారం తెలుపలేదు.

సినిమా విడుదలపై తెలంగాణలో ఎలాంటి నిషేధం లేకపోయినా కొంతమంది ఒత్తిడితో ఎఫ్‌ఎన్‌సీసీలో ప్రదర్శనను అడ్డుకోవడం తగదని, అలా చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని, పలువురు ఫిలింనగర్ క్లబ్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమాను ప్రదర్శించి.. ఒక వర్గం వారికే పెద్దపీట వేస్తున్నారనే అభియోగాలను వదిలించుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

7557
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles