సాయంత్రం 'ల‌క్ష్మీస్ ఎన్టీఆర్' వివ‌రాలు వెల్ల‌డించ‌నున్న‌ వ‌ర్మ‌

Fri,October 19, 2018 10:56 AM
lakshmis ntr launch today evening

వ‌రుస ఫ్లాపుల‌తో ఇబ్బంది ప‌డుతున్న రామ్ గోపాల్ వ‌ర్మ రీసెంట్‌గా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సినిమా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీ పార్వతి దృష్టికోణం నుంచి ఎన్టీఆర్‌ను చూపించబోతున్నట్టు తెలుస్తుంది. రాకేష్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాను జీవీ ఫిల్మ్స్‌ పతాకంపై బాల గిరి స‌మ‌ర్పిస్తున్నారు. అయితే ఈ రోజు ఎన్టీఆర్ గారి మీద గౌరవంతో తిరుమల శ్రీవారి పాదాల చెంత ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా లాంచ్ చేస్తాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ ద్వారా నాస్తికుడినైన నేను నా జీవితంలో మొట్టమొదటి సారిగా ఈ రోజు ఉద‌యం 6 గంటలకి తిరుపతి లో బాలాజీ వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని సాయంత్రం 4 గంటలకి తిరుపతి శిల్పారామం లో ప్రెస్ మీట్ పెట్టి లక్ష్మీస్ ఎన్టీఆర్ వివరాలు చెప్పబోతున్నట్టు తెలిపాడు. మ‌రి సాయంత్రం జ‌ర‌గ‌నున్న ప్రెస్‌మీట్‌లో వ‌ర్మ ఏఏ విష‌యాలు వెల్ల‌డిస్తాడా అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని జ‌న‌వ‌రి నెలాఖ‌రుకి విడుద‌ల చేయాల‌నుకున్న వ‌ర్మ ప్ర‌స్తుతం పాత్ర‌ల‌కి సంబంధించిన వారిని ఎంపిక చేసుకునే ప‌నిలో ఉన్నారు.


1739
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles