మ‌రోసారి తెర‌పైకి ల‌క్ష్మీస్ ఎన్టీఆర్

Sat,October 13, 2018 08:18 AM
lakshmis ntr comes on to the frame

కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్‌పై బ‌యోపిక్ తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నామ‌ని ప‌లువురు ద‌ర్శ‌క నిర్మాత‌లు స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. కాని అంద‌రి కంటే ముందు బాల‌య్య త‌న తండ్రి బ‌యోపిక్‌ని సెట్స్‌పైకి తీసుకెళ్ళాడు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుండ‌గా జ‌న‌వ‌రిలో రెండు పార్ట్‌లుగా ఈ మూవీ విడుద‌ల కానుంది. అయితే సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తాను ఎన్టీఆర్ బ‌యోపిక్‌ని ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ పేరుతో తెర‌కెక్కించనున్న‌ట్టు ప్ర‌క‌ట‌న చేస్తూ ఓ పోస్ట‌ర్ కూడా విడుద‌ల చేశారు. కాని ఆ ప్రాజెక్ట్ గురించి కొన్నాళ్ళుగా ఎలాంటి స‌మాచారం లేదు.

రామ్ గోపాల్ వ‌ర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ప్రాజెక్ట్‌కి తాజాగా మ‌రోసారి తెర‌పైకి తీసుకొచ్చాడు. స్వర్గీయ నందమూరి తారక రామారావు సతీమణి లక్ష్మీ పార్వతి జీవితం ఆధారంగా తీయనున్న మూవీ లాంచింగ్ ఈవెంట్‌ను దసరా (విజయదశమి) రోజు నిర్వహించనున్నట్లు తెలిపారు వర్మ. తన సినిమాలలో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’కు ఓ విశిష్టత ఉందన్నారు. తన కెరీర్‌లో ముహూర్తం చూసుకుని ఓ సినిమా కార్యక్రమాన్ని తొలిసారిగా నిర్వహించబోతున్నామని చెప్పారు. ఎన్టీఆర్‌గారి మీద గౌరవంతో తిరుమల శ్రీవారి పాదాల చెంత అక్టోబర్ 19న సినిమా లాంచింగ్ నిర్వహిస్తామన్నారు.

ఇక ఈ సినిమాని జ‌న‌వ‌రి నెలాఖ‌రుకి విడుద‌ల చేస్తానని చెప్పి అంద‌రికి షాక్ ఇచ్చాడు. లాంచింగ్ రోజు అనుకోని అతిథులు, అశ్చర్యాన్ని కలిగించే అతిథులు వస్తారంటూ ఆసక్తి పెంచే యత్నం చేశారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తర్వాత చోటు చేసుకున్న సంఘటనలతో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాను వర్మ తెరకెక్కించనున్నారు. ముంబై వ్యాపారవేత్త బాలగిరికి చెందిన జీవీ ఫిల్మ్స్‌ సంస్థ సమర్పిస్తోన్న సినిమాను రాకేశ్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.

2201
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles