ప్ర‌భుదేవా 'లక్ష్మీ' టీజ‌ర్ విడుద‌ల‌

Fri,February 23, 2018 12:25 PM
ప్ర‌భుదేవా 'లక్ష్మీ' టీజ‌ర్ విడుద‌ల‌

మ‌ల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్‌గా తెలుగు, త‌మిళం, హిందీ ప్రేక్ష‌కుల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు ప్ర‌భుదేవా. చివ‌రిగా ఎ.ఎల్ విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో అభినేత్రి అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ప్ర‌భుదేవా ఇప్పుడు మ‌ళ్ళీ ఎ.ఎల్‌. విజ‌య్‌తో క‌లిసి ల‌క్ష్మీ అనే చిత్రం చేస్తున్నాడు. డ్యాన్స్ ప్ర‌ధానంగా ఈ మూవీ రూపొందుతుంది. క‌రుణాక‌ర‌న్‌, కోవై స‌ర‌ళ‌, దిత్యా బాండే, స‌ల్మాన్ యూసుఫ్‌ఖాన్‌, చామ్స్‌, అక్ష‌త్ సింగ్‌, జీత్ దాస్‌, సాంపాల్ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. గ‌తంలో డ్యాన్స్ ప్ర‌ధానంగా తెర‌కెక్కిన 'స్టైల్' .. 'ఏబీసీడీ' వంటి సినిమాల‌కి విశేష ఆద‌ర‌ణ లభించ‌డంతో ల‌క్ష్మీ సినిమా కూడా మంచి హిట్ అవుతుంద‌నే టాక్ వినిపిస్తుంది. తాజాగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే చిత్రం మొత్తం కూడా డాన్స్ ప్ర‌ధానంగానే న‌డుస్తుంద‌ని తెలుస్తుంది. త‌మిళంతో పాటు తెలుగులోను ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. టీజ‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

1082

More News

VIRAL NEWS