క్రికెట్ టీం ఓన‌ర్‌గా మారిన మంచు వార‌మ్మాయి

Thu,September 14, 2017 12:36 PM
Lakshmi Manchu is the proud owner of Hyderabad Hawks

మ‌ల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ మంచు ల‌క్ష్మీ ఇప్పుడు క్రికెట్ టీం ఓన‌ర్‌గా మారింది. ఇన్నాళ్ళు న‌టిగా, వ్యాఖ్యాత‌గా ఇటు వెండితెర‌పై అటు బుల్లితెర‌పై అల‌రించిన ల‌క్ష్మీ త్వ‌ర‌లో మైదానంలో సంద‌డి చేయ‌నుంది. సెప్టెంబ‌ర్ 20 నుండి దుబాయ్‌లో జ‌ర‌గ‌నున్న ఇండియ‌న్ జూనియ‌ర్ ప్లేయ‌ర్స్ లీగ్‌(IJPL)లో పాల్గొన‌నున్న హైద‌రాబాద్ హాక్స్‌కి మంచు ల‌క్ష్మీ ఓన‌ర్‌గా ఉంటుంది. ఈ విష‌యాన్ని హైద‌రాబాద్ హాక్స్ మేనేజ్‌మెంట్ అఫీషియ‌ల్‌గా త‌మ సోష‌ల్ మీడియా పేజ్ ద్వారా తెలియ‌జేశారు. హైద‌రాబాద్ హాక్స్ టీం ఆడే ప్ర‌తి మ్యాచ్ లోను మంచు ల‌క్ష్మీ పాల్గొని వారిని ఎంక‌రేజ్ చేయ‌నుంద‌ని స‌మాచారం. ఇక యాక్ట‌ర్స్ అర్బాజ్ ఖాన్ , రాజీవ్ కండెల్‌వాల్ కూడా IJPL T20లో పాల్గొనే టీంస్‌కి ఫ్రాంచైజ్‌గా ఉన్నారు.

1453
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS