చిత్ర యూనిట్‌కి న‌య‌న‌తార ఇచ్చిన గిఫ్ట్స్ ఏంటో తెలుసా..!

Sun,February 10, 2019 01:36 PM
Lady Superstar Nayanthara gifted watches to the crew of Mr Local

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార త‌మిళ నాట వరుస సినిమాల‌తో దూసుకెళుతుంది. ఒక‌వైపు లేడీ ఒరియెంట్ చిత్రాల‌లో న‌టిస్తూనే మ‌రోవైపు గ్లామ‌ర్ పాత్ర‌ల‌లో న‌టిస్తుంది. పాత్ర‌కి ప్రాధాన్యం ఉంటే ఎలాంటి రోల్ అయిన చేసేందుకు ఈ అమ్మ‌డు ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. అయితే ‘ఓకే ఓకే ‘ఫేమ్ ఎమ్ రాజేష్ తెరకెక్కిస్తున్న మిస్ట‌ర్ లోక‌ల్ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తున్న న‌య‌న‌తార ఇటీవ‌ల త‌న పార్ట్‌కి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకుంది. షూటింగ్ పూర్తైన వెంట‌నే చిత్ర యూనిట్‌కి సంబంధించిన వారంద‌రికి ఫాసిల్ కంపెనీ వాచ్‌ల‌ని గిఫ్ట్‌గా అందించింది. దీనిపై చిత్ర బృందం సంతోషం వ్య‌క్తం చేసింది. గ‌తంలో కీర్తి సురేష్ పందెం కోడీ 2 చిత్ర షూటింగ్ ను పూర్తి చేసి యూనిట్ కు గోల్డ్ కాయిన్స్ ను గిఫ్ట్ గా ఇచ్చిన విష‌యం తెలిసిందే. న‌య‌న‌తార న‌టించిన మిస్ట‌ర్ లోక‌ల్ చిత్రంలో శివ‌కార్తికేయ‌న్ క‌థానాయ‌కుడిగా న‌టించారు. హిప్ హాప్ సంగీతం అందించారు. ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

4288
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles