పురుషులు, మ‌హిళ‌ల టీం మ‌ధ్య జ‌రిగిన 'అంతిమ యుద్ధం'

Wed,August 8, 2018 09:18 AM
Ladies Vs Gentlemen task in episode 59

త‌ర‌త‌రాలుగా యుగ‌యుగాలుగా పురుషులకి, మ‌హిళ‌ల‌కి మ‌ధ్య ఆధిప‌త్య పోరు కొన‌సాగుతూనే ఉంది. ఈ క్ర‌మంలో బిగ్ బాస్ హౌజ్‌లో పురుషుల‌ని, మ‌హిళ‌ల‌ని రెండు టీంలుగా విభ‌జించి అంతిమ యుద్ధం అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌తి టీంకి బిగ్ బాస్ ఇంట్లోని రెండు స్థ‌లాల‌పై నియంత్ర‌ణ ఉంటుంది. మహిళల టీం నియంత్రణలో ఉండే స్థలాలు బెడ్ రూం, కిచెన్ కాగా.. పురుషులు టీం నియంత్రణలో లివింగ్ ఏరియా, బాత్ రూంలు ఉంటాయి. ఈ స్థలాలను వాడుకోవాలంటే అటు పురుషులు ఇటు మ‌హిళ‌లు గోల్డ్ కాయిన్‌ని ఇచ్చి వాడుకోవాలనేది గేమ్ రూల్స్. ఇందుకోసం ఇరు టీంలకు చెరో 50 గోల్డ్ కాయిన్స్ ఇవ్వ‌డం జ‌రిగింది. మ‌రిన్ని గోల్డ్ కాయిన్స్ గెలుచుకోవాలంటే బిగ్ బాస్ రోజు మొత్తం మీద ఇచ్చే కొన్ని టాస్క్‌ల‌ని పూర్తి చేయ‌వ‌ల‌సి ఉంటుంది. టాస్క్ పూర్త‌యిన త‌ర్వాత ఎవ‌రి ద‌గ్గ‌ర ఎక్కువ కాయిన్స్ ఉంటాయో వారే టాస్క్ విజేత‌ల‌ని బిగ్ బాస్ నిర్ణ‌యించారు.

గ‌త ఎపిసోడ్‌లో గాయ‌మైన నూత‌న్ నాయుడుకి బిగ్ బాస్ మిన‌హాయింపు ఇచ్చారు. ఏ స‌ర్వీస్‌కి ఎంత చెల్లించాల‌నేది నిర్ణ‌యించుకొని టాస్క్ ప్రారంబించ‌మ‌ని బిగ్ బాస్ చెప్పారు. ఈ టాస్క్‌లో చూపిన ప్ర‌తిభ కెప్టెన్సీ ఎంపిక‌పై ఆధార ప‌డి ఉంటుంద‌ని కూడా అన్నారు. టాస్క్ ప్రారంభానికి ముందు ఎవ‌రికి సంబంధించిన వ‌స్తువుల‌ని వారు ఇంట్లో నుండి తెచ్చుకొని అనంతరం గేమ్ స్టార్ట్ చేశారు. బిగ్ బాస్ కేటాయించిన స్థ‌లాల‌ని స్వాధీనం చేసుకున్న త‌ర్వాత పురుషుల, మ‌హిళ‌ల టీం మ‌ధ్య హోరా హోరీగా టాస్క్ జ‌రిగింది. మ‌హిళ‌ల‌కి సంబంధించిన కాయిన్స్‌ని కౌశ‌ల్ తీసుకెళ్ల‌డంతో పూజా, కౌశ‌ల్ మ‌ధ్య పెద్ద వివాద‌మే రేగింది. కాయిన్స్ పెట్టినప్పుడు మీరు ఎందుకు తీసుకోలేద‌ని కౌశ‌ల్ వాదించ‌గా, బ‌జ‌ర్ కోసం వేచి చూశామ‌ని పూజా చెప్పుకొచ్చింది.

మ‌హిళ‌లు వారికి కేటాయించిన కాయిన్స్ మొత్తం ఇల్లంతా వెత‌క‌డం మొద‌లు పెట్టారు. లెక్క‌లేనన్ని ఫీట్స్ చేశారు. ఒకానొక సంద‌ర్భంలో పూజా కౌశల్‌పై కోపం ప‌ట్ట‌లేక‌ త‌మ కాయిన్స్ విసిరేసింది. ఆ కాయిన్స్ త‌నీష్ స్వాధీనం చేసుకోవ‌డంతో మ‌హిళ‌ల టీంకి సంబంధించిన దీప్తి, గీతా, సున‌య‌న‌లు కాయిన్స్ ని ద‌క్కించుకునేందుకు నానా తంటాలు ప‌డ్డారు. కాయిన్స్ కోసం దీప్తి.. త‌నీష్‌కి నిమ్మ‌కాయ నీళ్లు క‌లిపి ఇచ్చింది. దీంతో ఒక కాయిన్ ఇచ్చాడు త‌నీష్‌. పూజా విసిరిన ఏడు కాయిన్స్ మాత్రం అస్స‌లు ఇవ్వ‌న‌న్న త‌నీష్ రెండు కాయిన్స్ పూజాకి ఇచ్చాడు. మిగ‌తా 40 కాయిన్స్ కౌశ‌ల్ ద‌గ్గ‌రే ఉండ‌డంతో ఆయ‌న ద‌గ్గ‌ర నుండి ఆ కాయిన్స్ పొంద‌డానికి మ‌హిళ‌ల టీం చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు.

సందులో స‌డేమియా అన్న‌ట్టు కౌశ‌ల్ అంటే ఏమిటో ఇప్పుడు అర్ధ‌మైందా పూజా. గ‌త 50 రోజుల నుండి ఆయ‌న ఇలానే గేమ్ ఆడుతున్నాడు అని బాబు గోగినేని అన్నారు. అంతేకాదు మ‌హిళ‌ల‌కి ఫేవ‌ర్ చేయాల‌ని చాలా ప్ర‌య‌త్నించాడు. కౌశ‌ల్ గేమ్ నిజాయితీగా ఆడటంలేదని ఇది కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. దీనికి తనీష్, సామ్రాట్‌, రోల్ రైడాలు కూడా మద్దతు తెలపడంతో కాయిన్స్ తిరిగి ఇచ్చేయాల‌ని కౌశ‌ల్‌తో చెప్పిన అత‌ను రాజీ ప‌డ‌లేదు. ఇక ఆ త‌ర్వాత టైర్ పై కూర్చోబెట్టి లాగే టాస్క్ ప్రారంభ‌మైంది. శ‌రీర‌ధృడ‌త్వంతో కూడుకున్న టాస్క్ అని చెప్పిన బిగ్ బాస్ టైర్ పై మ‌నుషుల‌ని కూర్చోపెట్టి ఎక్కువ మందిని ఎవ‌రు తొంద‌ర‌గా లాగుతారో వారే విజేత‌లు అని బిగ్ బాస్ అన్నారు. ధృడ‌త్వంతో కూడుకున్న టాస్క్ కాబ‌ట్టి పురుషుల టీమే మ‌హిళ‌ల‌పై .. పై చేయి సాధించింది.

మ‌రో టాస్క్‌లో సర్కిల్‌లో ఉన్న కాయిన్స్ ని ద‌క్కించుకోవ‌ల‌సి ఉండ‌గా, మ‌హిళ‌లో పూజా త‌ప్ప ఎవ‌రు కాయిన్స్ గెలుచుకోలేదు. పురుషుల‌లో కౌశ‌ల్‌, అమిత్‌, సామ్రాట్‌లు కాయిన్స్ గెలుచుకున్నారు. 59వ ఎపిసోడ్ అంతిమ యుద్ధం టాస్క్‌లో భాగంగా జ‌రిగిన పోటీలు అన్నీ ముగియ‌క‌పోవ‌డంతో 60 ఎపిసోడ్‌లో కూడా ‘అంతిమ యుద్ధం’ టాస్క్ కొనసాగింపు ఉండనుంది. 60 రోజు ముందుగా క‌బ‌డ్డీ పోటీ జ‌ర‌గ‌నుంది. దీంట్లో ఎవ‌రు పై చేయి సాధిస్తారో వేచి చూడాలి.

1995
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS