అజ్ఞాతవాసి టీంపై ఖుష్బూ ప్రశంసలు

Mon,December 4, 2017 03:02 PM
kushboo says good bye to Agnyaathavaasi team

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం అజ్ఞాతవాసి. వారణాసిలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తుండగా, సీనియర్ నటి ఖుష్బూ కీలక పాత్ర పోషించింది. అయితే తాజాగా చిత్రానికి సంబంధించి తన పార్ట్ పూర్తైందని తెలిపింది ఖుష్బూ. అంతేకాదు దర్శకుడు త్రివిక్రమ్, హీరో పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించింది.

ఖుష్బూ తన ట్విట్టర్ వేదికగా ..టీంని విడిచి వెళ్ళడం చాలా బాధగా ఉందని తెలిపింది. కొందరిని విడిచి వెళ్తూ గుడ్ బై చెప్పాలంటే బాధగా ఉంటుంది. ఆ కోవలోకి అజ్ఞాతవాసి టీం వస్తుంది. మంచి వ్యక్తులని వదిలి వెళ్తుంటే నా కళ్ళు చెమర్చాయి. డీఓపీ మణికందన్ ప్రియమైన వ్యక్తి. చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నానని బాధాతప్త హృదయంతో ట్వీట్ చేసింది ఖుష్బూ. ఆ తర్వాత త్రివిక్రమ్ తో దిగిన ఫోటోని షేర్ చేస్తూ .. త్రివిక్రమ్ తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన సింప్లిసిటీ, నటులను ప్రోత్సహించడం, వారి దగ్గర మంచి ఔట్ పుట్ రాబట్టేందుకు ఆయన పడే తపన నన్ను ఆశ్చర్యానికి గురి చేసాయి. కో స్టార్ పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు.. మీ అందరిని మిస్ అవుతున్నానంటూ ఖుష్బూ కాస్త సెంటిమెంటల్ గానే ట్వీట్ చేసింది.


2689
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles