అర్జున్‌ 150వ చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేసిన నాని

Thu,June 28, 2018 09:51 AM
Kurukshetram  Official Movie Trailer released

యాక్షన్ కింగ్ అర్జున్ సినిమాలంటే అభిమానుల రోమాలు నిక్క పొడుచుకోవాల్సిందే. మరి అంతలా ఉంటాయి అర్జున్ మూవీలో యాక్షన్ సీన్స్. అయితే కొద్ది రోజుల నుండి సినిమాల‌ను చాలా తగ్గించాడు. ఇప్పుడు అర్జున్ ప్రధాన పాత్రలో త‌న 150వ చిత్రం కురుక్షేత్రం టైటిల్ తో రూపొందుతుంది. కంప్లీట్ స్టైలిష్‌ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో నిబునన్, కన్నడలో విస్మయ పేరుతో విడుదల కానుంది. అరుణ్‌ వైధ్యనాధన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అర్జున్ ఓ సీరియల్ కిల్లర్‌ను పట్టుకునే మోస్ట్ టాలెంటెడ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.

తాజాగా అర్జున్ 150వ చిత్రం కురుక్షేత్రం చిత్ర ట్రైల‌ర్ నాని చేతుల మీదుగా విడుద‌లైంది. ‘మనం ఎలా ఆలోచిస్తున్నామో వాడూ అలానే ఆలోచిస్తున్నాడు. కాబట్టి.. మనం వాడికంటే ముందుండాలి’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. అప్పట్లో వచ్చిన అర్జున్ సినిమాల మాదిరిగానే ఈ 150వ సినిమా ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మూవీ కోసం ఇటు తెలుగు, అటు తమిళ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రసన్న, వైభవ్, వరలక్ష్మి శరత్ కుమార్, సుమన్, సుహాసిని, శ్రుతి హరిహరన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


2062
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS