అర్జున్ 150 మూవీ యాక్షన్ ప్యాక్డ్ టీజ‌ర్

Tue,June 27, 2017 12:52 PM
Kurukshethram   Teaser released

యాక్ష‌న్ కింగ్ అర్జున్ 150వ చిత్రం కురుక్షేత్రం అనే టైటిల్ తో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. అరున్ వైద్య‌నాధ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ రూపొందుతుండ‌గా ప్ర‌సన్న‌, వ‌ర‌ల‌క్ష్మీ, వైభ‌వ్, శృతి హాస‌న్,సుమ‌న్ మ‌రియు సుహాసిని వంటి స్టార్స్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. త‌మిళంలో నిబున‌న్ అనే టైటిల్ తో తెర‌కెక్కిన ఈ చిత్రం తెలుగులో కురుక్షేత్రం పేరుతో విడుద‌ల కానుంది. ఆగ‌స్ట్ లో ఈ మూవీని రిలీజ్ చేయాల‌ని భావిస్తుండగా, తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్ మూవీపై భారీ ఎక్స్ పెక్టేష‌న్స్ పెంచింది. థ్రిల్లర్ మూవీగా ఈ చిత్రం రూపొందుతుంద‌ని తెలుస్తుండ‌గా, ఇందులో అర్జున్ చేసిన కొన్ని స్టంట్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయ‌ని స‌మాచారం. పాష‌న్ స్టూడియోస్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ కురుక్షేత్రం మూవీని నిర్మిస్తుంది.

1075
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles