ఆ సీన్ కోసం.. నగ్నంగా ఏడు టేక్‌లు..!

Wed,July 11, 2018 05:55 PM
Kubra Sait explains how she does nude scene in Sacred Games

సేక్రెడ్ గేమ్స్.. నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన ఈ టీవీ సిరీస్‌కు విమర్శలతోపాటు ప్రశంసలు కూడా వచ్చాయి. అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వంలో ఈ టీవీ సిరీస్ తెరకెక్కింది. సైఫ్ అలీ ఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ లీడ్ రోల్స్‌లో నటించారు. అయితే ఇందులో ఉన్న సెక్స్ సీన్లపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇందులో ఓ ట్రాన్స్‌జెండర్ క్యారెక్టర్ కూడా ఉంది. ఆ పాత్ర పేరు కుకూ. ఈ పాత్రలో నటించిన కుబ్రా సైత్‌పై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తున్నది.

ఇందులో ఓ సీన్‌లో ఆమె పూర్తి నగ్నంగా కనిపిస్తుంది. అయితే ఈ సీన్ చేసినందుకు తానేమీ తప్పు చేసినట్లు ఫీలవడం లేదని ఆమె చెబుతున్నది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను ఆడిషన్‌కు వెళ్లినపుడే ఇందులో ఓ నగ్నంగా నటించాల్సిన సీన్ ఉందని చెప్పారు. మీరు స్క్రీన్‌పై ఆ సీన్ చూసినపుడు ఎంత అందంగా దానిని చిత్రీకరించారో మీకు తెలుస్తుంది. మంచి టీమ్‌తో పని చేస్తున్నపుడు ఏ పొరపాటూ జరగదు అని కుబ్రా చెప్పింది.

ఆ సీన్ పక్కాగా రావడానికి డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఏడు టేక్‌లు తీసుకున్నాడని ఆమె తెలిపింది. ఈ సీన్ మళ్లీ మళ్లీ చేయిస్తున్నందుకు ఆయన క్షమాపణ కూడా చెప్పాడని కుబ్రా చెప్పింది. సేక్రెడ్ గేమ్స్ టీవీ సిరీస్.. 2006లో వచ్చిన విక్రమ్ చంద్ర రాసిన బుక్ ఆధారంగా తెరకెక్కింది. 1980, 90ల్లో ముంబైలోని గ్యాంగ్‌స్టర్లు, పోలీసులు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్లు.. వాళ్ల మధ్య సినిమా నటులు పడిన ఇబ్బందులను ఈ బుక్‌లో రాశారు.

7287
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles