విజయ్ దేవరకొండ ఇంట్లో కేటీఆర్

Sun,June 24, 2018 09:46 PM
ktr went vijay devarakonda home for lunch

హైదరాబాద్: ఎప్పుడూ ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారులతో సమావేశాలతో బిజీగా ఉండే తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తాజాగా యువ కథానాయకుడు, అర్జున్ రెడ్డి ఫేం విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లారు. అర్జున్ రెడ్డి సినిమాకు గాను విజయ్ ఉత్తమ నటుడిగా తొలి ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్న విషయం తెలిసిందే. ఐతే ఈ అవార్డును ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు కూడా. ఈ అవార్డును వేలం వేసి దాని ద్వారా వచ్చిన డబ్బును ఆపదలో ఉన్నవారికి ఇవ్వాల్సిందిగా ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను విజయ్ కోరిన విషయం తెలిసిందే. కేటీఆర్ స్పందిస్తూ విజయ్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు.

ఆదివారం సాయంత్రం కేటీఆర్ నగరంలోని విజయ్ ఇంటికి అతిథిగా వెళ్లారు. ఇదే విషయాన్ని విజయ్ తన ట్విటర్ ద్వారా వెల్లడిస్తూ.. 'మీ ఇంటికి లంచ్ చేయడానికి మీకు ఇష్టమైన నాయకుడు వస్తే ఎలా ఉంటుంది.? ఒక్క సెకను.. అసలు ఏం జరుగుతోంది బాసూ..? బేసిక్‌గా ఏమైనా జరగొచ్చు. మనకు ఏది నచ్చిది దాన్ని చేసుకుంటూ పోవాల్సిందే.' అంటూ తన ఫ్యామిలీతో కేటీఆర్ ఉన్న ఫొటోను షేర్ చేశారు.

'కేటీఆర్‌కు నా ఫిల్మ్‌ఫేర్ చూపించా, వేలం గురించి వివరించా. హ్యాండ్‌లూమ్స్‌పై అవగాహన, నీటి పొదుపు, హైదరాబాద్ రోడ్లు ఎందుకు తవ్వుతున్నారు. చరిత్ర, తన తండ్రి & బాస్, కుమారుడి గురించి చర్చించాం. విజయ్ ప్లాస్టిక్ వాడటం ఆపు' అని అన్నారు. కేటీఆర్‌కు సిటీని చూపిస్తున్న మరొక ఫొటోను అభిమానులతో విజయ్ షేర్ చేశారు.8102
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS