మ‌హాన‌టిపై కేటీఆర్ ప్ర‌శంస‌ల జ‌ల్లు

Thu,May 10, 2018 07:57 AM
ktr praises mahanati movie and artists

అభిన‌వ నేత్రి మ‌హాన‌టి సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన మ‌హాన‌టి చిత్రంపై తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌శంస‌లు కురిపించారు. మ‌హాన‌టి చిత్రం చాలా అద్భుతంగా ఉంద‌ని అన్నారు. నిజంగా ఈ చిత్రం ఎంత‌గానో అల‌రించింది. సావిత్రి పాత్ర‌కి కీర్తి సురేష్ జీవం పోసింది. దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత స్వప్నలకు తన అభినందనలు తెలిపారు. సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, నాగచైతన్యల నటన అద్భుతంగా ఉందని కేటీఆర్ త‌న ట్వీట్ ద్వారా కొనియాడారు. మ‌హాన‌టి చిత్రంపై ఇప్ప‌టికే రాజ‌మౌళి, రాఘ‌వేంద్ర‌రావు, అట్లీ, సుశాంత్‌, మోహ‌న్ బాబుతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు కురిపించిన సంగ‌తి తెలిసిందే. దాదాపు 18 నెల‌ల పాటు చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న మ‌హాన‌టికి ఇంత భారీ రెస్పాన్స్ రావ‌డంతో అశ్వినీద‌త్ చాలా హ్యాపీగా ఫీల‌వుతున్నాడు. స‌రిగ్గా మే 9న జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి చిత్రం వైజ‌యంతి బ్యాన‌ర్‌లోనే విడుద‌లై సంచ‌ల‌నం క్రియేట్ చేసింది. ఇప్పుడు మ‌హాన‌టి కూడా భారీ రికార్డులు తిర‌గరాసే దిశ‌గా దూసుకెళుతుంది. చిత్రంలో సావిత్రి పాత్ర‌ని కీర్తి సురేష్ పోషించ‌గా, జెమినీ గ‌ణేష‌న్‌గా దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించారు.4998
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles