కూతురి జ‌యంతి సంద‌ర్బంగా ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టిన చిత్ర‌

Wed,December 19, 2018 09:29 AM
KS Chithra Posts A Warm Tribute To Her Late Daughter

త‌న పాట‌ల‌తో సంగీత ప్రియులని ఎంత‌గానో ప‌ర‌వ‌శింపజేసే చిత్ర త‌న కూతురి జ‌యంతి సంద‌ర్భంగా ఫేస్ బుక్‌లో ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టింది. చిత్ర కూతురు నంద‌న 7 ఏళ్ళ వ‌య‌స్సులో క‌న్నుమూసింది. ఏప్రిల్ 2011న ఈ ఘ‌ట‌న జ‌రిగింది. స్మిమ్మింగ్ పూల్‌లో ప‌డి చ‌నిపోయిన ఆ చిన్నారి మ‌ర‌ణంతో చిత్ర సంవ‌త్స‌రం పాటు కోలుకోలేపోయింది. ఆ చిన్నారి మృతి చిత్ర కుటుంబ స‌భ్యుల‌నే కాదు ఆమె అభిమానుల‌తో పాటు సినీ ప‌రిశ్ర‌మ‌ని దిగ్భ్రాంతికి గురి చేసింది. నిన్న చిత్ర కూతురు నంద‌న జ‌యంతి కావ‌డంతో చిన్నారి ఫోటోని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి నివాళులు అర్పించింది. ప‌ర‌లోకం నుండి వ‌చ్చిన దేవ‌దూత మా జీవితాన్ని అద్భుత క‌థ‌గా మార్చింది. నువ్వు మాకు దొరికిన గొప్ప సంప‌ద అంటూ ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టింది చిత్ర‌.

4256
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles