అభిమాని ఇచ్చిన బహుమతితో ఫుల్ ఖుష్‌ అయిన మహేష్‌ హీరోయిన్

Sun,September 17, 2017 10:51 AM

కృతి సనన్ .. ఈ పేరు హిందీ ప్రేక్ష‌కుల‌కే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే సుపరిచితం. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌ సరసన 1 నేనొక్కడినే చిత్రంలో కథానాయికగా నటించిన ఈ అమ్మడు ఈ తర్వాత నాగ చైతన్య సరసన దోచేయ్ అనే చిత్రం చేసింది. ఈ రెండు చిత్రాలు బాక్సీఫీస్ దగ్గర బోల్తా కొట్టేసరికి బాలీవుడ్ కి వెళ్లింది. అక్కడ ఆచితూచి సెలక్టివ్ కథలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంది. రీసెంట్ గా బరేలీ కీ బర్ఫీ అనే చిత్రం చేయగా, ఈ మూవీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రశంసలు అందుకోవడం విశేషం. అయితే ఈ చిత్ర షూటింగ్ ఉత్తర ప్రదేశ్‌ లోని బరేలీలో కొన్ని రోజల పాటు జరిగింది. షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఓ అభిమాని లొకేషన్ కి వచ్చి బరేలీలో తయరు చేసిన జుంకీలను తనకి గిఫ్ట్ గా ఇచ్చాడట. ఈ విషయాన్ని కృతి సనన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. తన పట్ల అంత అభిమానం చూపించినందుకు ధన్యవాదాలు తెలిపింది కృతి సనన్.

1667
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles