డ్రెస్ లపై కృతిసనన్ వితండ వాదం

Thu,June 22, 2017 04:35 PM
Kriti Sanon sensational comments on ladies dress

సినిమాల్లోనే కాదు, బయటికొచ్చేటప్పుడు కూడా డ్రెస్సింగ్ విషయంలో ఇప్పుడు తారలు ముందడుగు వేశారు. కొంతకాలంగా హీరోయిన్స్ ఫంక్షన్స్ కు సెక్సప్పీల్ డ్రెస్ లు వేసుకొస్తున్నారు. ప్రార్థనా మందిరాలకు, ప్రధానమంత్రి వంటి ప్రముఖుల దగ్గరకు వెళ్లేటప్పుడు, ఫంక్షన్స్ కు హాజరయ్యేటప్పుడు కూడా సభ్యతకు అభ్యంతరకరమైన దుస్తులు వేసుకొస్తున్నారు, వారలా చేయడంపై వివాదాలు రేగుతున్నాయి.

బయటికొచ్చేటప్పుడు వేసుకునే దుస్తుల విషయంలో కొన్ని పరిమితులుంటాయి. గౌరవనీయంగా కనపడాలి. కానీ కొన్ని సందర్భాల్లో అందుకు భిన్నంగా జరుగుతోంది. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఈ మధ్య ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసినప్పుడు పొట్టి దుస్తుల్లో వెళ్లిందని విమర్శలు వచ్చాయి. అలాగే ఛార్మి ఫారిన్ లో ఓ సినిమా షూటింగ్ కు వెళ్లి, అక్కడ ఓ గురుద్వారాను దర్శించింది. ఆ సందర్భంగా లో దుస్తులు వేసుకోకుండా వెళ్లినందుకు పెద్ద వివాదమే రేగింది.

ఇలాంటిదే మరో సందర్భం ఎదురైంది. రంజాన్ మాసంలో నటి ఫాతిమా సనాషేక్ స్లిమ్ సూట్ లో ఫోటోలు దిగిందని నెట్ లో ఘాటైన విమర్శలే వచ్చాయి. అలాగే దీపికా పదుకొనే ఓ మ్యాగజైన్ కోసం వేసుకున్న డ్రెస్ పై కూడా కామెంట్స్ వచ్చాయి. నటీమణుల దుస్తులపై ఇంతగా విమర్శలు వస్తుంటే హీరోయిన్ కృతి సనన్ ధోరణి వింతగా ఉంది. తాము ఏ డ్రెస్ వేసుకోవాలో ఎవరూ చెప్పక్కర్లేదని మొండి వాదనకు దిగింది. ఎప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలో తమకు తెలుసని, లేడీస్ ఏ డ్రెస్ వేసుకోవాలో ఎవరూ చెప్పక్కర్లేదని విరుచుకు పడింది. కృతి సనన్ వాదనపై చాలామంది మండిపడుతున్నారు. సభ్యతా సంస్కారాలను మరచి మాట్లాడుతోందని, మంచిమాట చెబితే వినాలని హెచ్చరిస్తున్నారు.

2263
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles