స్నేహితులతో కృతిసనన్ మాల్దీవులు ట్రిప్..వీడియో

Mon,June 17, 2019 06:57 PM
Kriti Sanon Maldives vacation with her friends


ఈ ఏడాది ‘లుకాచుప్పి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది బాలీవుడ్ నటి కృతిసనన్. ప్రస్తుతం దిల్జీత్ దోసాంజ్‌తో కలిసి ‘అర్జున్ పాటియాలా’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. రోజూ షూటింగ్‌తో బిజీబిజీగా గడిపిన కృతిసనన్..ఇపుడు తనకిష్టమైన ప్రాంతానికి వెళ్లి ఎంజాయ్ చేస్తోంది. కృతి స్నేహితులతో కలిసి మాల్దీవులు ట్రిప్‌కు వెళ్లింది.

ప్రైవేట్ జెట్ రైడ్స్, బీచ్ తీరానికి సమీపంలో సైక్లింగ్ చేయడం, బీచ్‌లో సరదాగా స్నేహితులతో కలిసి ట్రిప్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. మాల్దీవుల్లో మా గ్యాంగ్‌తో కలిసి అల్లరి అంటూ కామెంట్ పోస్ట్ చేసింది కృతిసనన్. కృతిసనన్ మాల్దీవులు టూర్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. టూర్ తర్వాత అర్జున్ పాటియాలా ప్రమోషన్స్‌తో బిజీ కానుంది కృతిసనన్.1848
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles