రెండోసారి హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్న హీరోయిన్

Thu,May 10, 2018 08:21 AM
Kriti Sanon horse riding for panipat

ఈ మ‌ధ్య కాలంలో కొంద‌రు హీరోయిన్స్ కేవ‌లం గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకోవాల‌నే ఆలోచ‌న‌లు పెట్టుకోకుండా హీరోల‌కి ధీటుగా వినూత్న ప్ర‌యోగాలు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. స‌వాళ్ళని కూడా స్వీక‌రిస్తున్నారు. బాలీవుడ్ భామ కృతిస‌న‌న్ త‌న తాజా చిత్రం పానిప‌ట్ కోసం హార్స్ రైడింగ్ నేర్చుకుంటుంది. 2017లో రాబ్తా సినిమా కోసం హార్స్ రైడింగ్ ప్రాక్టీస్ చేసిన కృతి ఇప్పుడు మ‌ళ్ళీ ట్రైనింగ్‌కి వెళుతుంది. సౌత్ ముంబైలోని అమ‌ట్యుయ‌ర్ రైడ‌ర్స్ క్ల‌బ్‌లో ట్రైన‌ర్ సురేష్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో హార్స్ రైడింగ్ నేర్చుకుంటుంది. ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. మ‌రో ప్ర‌ధాన పాత్ర అయిన అర్జున్ క‌పూర్ కూడా హార్స్ రైడింగ్ శిక్ష‌ణ తీసుకుంటున్నాడు. పానిప‌ట్ చిత్రం అశుతోష్ గోవ‌ర్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా ఇందులో అర్జున్ క‌పూర్‌, సంజ‌య్ ద‌త్, కబీర్‌ బేడి , కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబ‌ర్ 9, 2019న ఈ చిత్రం విడుద‌ల కానుంది. 17వ శతాబ్దంలో జరిగిన మూడో పానిపట్‌ యుద్ధ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని బీటౌన్‌ టాక్‌. కృతీసనన్‌. మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘1: నేనొక్కడినే’, నాగచైతన్య హీరోగా చేసిన ‘దోచేయ్‌’ చిత్రాలతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా సుప‌రిచిత‌మే.
3004
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles