టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘వన్..నేనొక్కడినే’ సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది కృతిసనన్. ఆ తర్వాత నాగచైతన్యతో కలిసి దోచెయ్ చిత్రంలో నటించింది. ఈ రెండు చిత్రాలు పూర్తవగానే బాలీవుడ్ కు చెక్కేసింది. కృతిసనన్ నటించిన హిందీ చిత్రం ‘లుకా చుప్పి’ ఇటీవలే విడుదలై బాక్సాపీస్ వద్ద రూ.90 కోట్లను వసూలు చేసింది.
వరుస ఆఫర్లతో బిజీబిజీగా ఉన్న ఈ నటి ఇపుడు రెమ్యునరేషన్ ను పెంచేసిందట. ప్రస్తుతం కృతిసనన్ ఒక్క సినిమాకు కోటిన్నర రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి. కృతిసనన్ నటనకు ఫిదా అవుతున్న నిర్మాతలు ఆమెతో సినిమా చేసేందుకు క్యూ కడుతున్నారని టాక్ వినిపిస్తోంది. కృతిసనన్ ప్రస్తుతం కళంక్, అర్జున్ పాటియాలా, హౌస్ ఫుల్ 4, పానిపట్ చిత్రాల్లో నటిస్తోంది.