రెండు ద‌శాబ్ధాల త‌ర్వాత‌..కృష్ణ‌వంశీ-రమ్య‌కృష్ణ కాంబినేష‌న్‌లో చిత్రం

Tue,October 15, 2019 09:58 AM

త‌న చిత్రాల‌కి క్రియేటివిటీని జోడించి ఎంతో అందంగా తెర‌కెక్కించే కృష్ణ‌వంశీ ఈ మ‌ధ్య మంచి హిట్‌ల‌ని అందుకోలేక‌పోతున్నాడు. ఒక‌ప్పుడు కృష్ణ వంశీ చిత్రం రిలీజ్ అవుతుందంటే అది ప‌క్కా హిట్ అనే అభిప్రాయం అభిమానుల‌లో ఉండేది. కాని ఈ మ‌ధ్య మంచి స‌క్సెస్ ఒక్క‌టి కూడా అతని ఖాతాలో చేర‌డం లేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం కృష్ణ వంశీ త‌న భార్య రమ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో ఓ చిత్రాన్ని రూపొందించే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌. ఇందులో విలక్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్, అవికాగోర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. కాగా, కృష్ణ వంశీ, రమ్య‌కృష్ణ తొలిసారి 1998లో చంద్ర‌లేఖ సినిమా కోసం ప‌నిచేశారు. మ‌ళ్ళీ 20 ఏళ్ళ త‌ర్వాత వారిద్దరు ఓ ప్రాజెక్ట్ కోసం క‌లిసి పని చేయ‌నుండ‌డం విశేషం.

3142
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles