18 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఒకే చిత్రంలో తండ్రి కొడుకులు?

Fri,August 11, 2017 11:43 AM
krishna guest role in mahesh movie

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకి ప‌రిచ‌యం అయిన సంగ‌తి తెలిసిందే. ఇక త‌న తండ్రి న‌ట శేఖ‌ర కృష్ణ తో క‌లిసి ‘కొడుకు దిద్దిన కాపురం’, ‘ముగ్గురు కొడుకులు’ ‘గూఢాచారి 117’ అనే చిత్రాల‌లో బుల్లి స్టార్ గా మెరిసాడు ప్రిన్స్ మ‌హేష్‌. రాజుకుమారుడు అనే చిత్రంతో హీరోగా మారిన మ‌హేష్ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల‌లో ఒక‌రిగా ఉన్నారు. ఈయ‌న హీరో అయిన త‌ర్వాత చేసిన రాజ‌కుమారుడు, వంశీ, ట‌క్క‌రి దొంగ చిత్రాల‌లో కృష్ణ‌ గెస్ట్ రోల్స్ చేశాడు. ట‌క్క‌రి దొంగ త‌ర్వాత మ‌హేష్ , కృష్ణ‌ క‌లిసి మ‌రే చిత్రం చేయ‌లేదు . కాని ఇప్పుడు 18 సంవ‌త్స‌రాల త‌ర్వాత వీరిద్ద‌రు క‌లిసి ఓ చిత్రం చేయ‌నున్నార‌నే వార్త ఫిలిం న‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతుంది.

మ‌హేష్ ప్ర‌ధాన పాత్ర‌లో కొర‌టాల శివ భ‌ర‌త్ అను నేను అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పొలిటిక‌ల్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మ‌హేష్ సీఎం పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. కృష్ణ ఓ ప్రత్యేక పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా , కొంద‌రు సీనియ‌ర్ న‌టులు మంత్రులు, ఎంపీల పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. కైరా అద్వాణీ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రం డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బేన‌ర్ పై నిర్మిత‌మవుతుంది. మ‌హేష్ న‌టించిన స్పైడ‌ర్ చిత్రం సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల కానుండ‌గా, కృష్ణ చివ‌రిగా శ్రీ శ్రీ అనే చిత్రాన్ని చేశాడు.

2958
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles