నిర్మాత‌గా క్రిష్‌.. హీరోగా అవ‌స‌రాల‌

Sat,October 19, 2019 12:10 PM

టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క్రిష్ .. వరుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన అంత‌రిక్షం చిత్రంతో నిర్మాత‌గా అవ‌తారం ఎత్తిన సంగ‌తి తెలిసిందే. సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అంత‌రిక్షం తెర‌కెక్క‌గా, ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర నిరాశ‌ప‌రచింది. దీంతో కొన్నాళ్ళు నిర్మాణానికి దూరంగా ఉన్నాడు క్రిష్‌. ఇక ఇప్పుడు దిల్ రాజుతో క‌లిసి ఓ కొత్త చిత్రాన్ని నిర్మించే ఆలోచ‌న‌లు చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ చిత్రంలో అవ‌స‌రాల శ్రీనివాస్ హీరోగా ఉంటార‌ని తెలుస్తుంది. ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. క్రిష్ చివ‌రిగా ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు చిత్రాల‌ని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.

883
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles