2.0 తో పోటీ త‌ప్పింది.. మ‌రి మణిక‌ర్ణిక‌తో ..

Wed,June 13, 2018 01:16 PM
krish movie fight with gold

ఈ మ‌ధ్య కాలంలో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ వాతావ‌ర‌ణం ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. ఒకేసారి నాలుగైదు సినిమాలు విడుద‌ల అవుతుండే స‌రికి క‌లెక్ష‌న్స్ డ్రాప్ అవ్వ‌డ‌మే కాక థియేట‌ర్స్ స‌మ‌స్య కూడా వ‌స్తుంది. అయితే కొద్ది రోజులుగా 2.0, గోల్డ్‌, సూప‌ర్ 30 చిత్రాలు వచ్చే ఏడాది రిప‌బ్లిక్ డేకి రిలీజ్ అవుతాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది. అంటే మూడు పెద్ద సినిమాలు ఒకేసారి విడుద‌లైతే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర యుద్ధ వాతావ‌ర‌ణం కనిపిస్తుంద‌ని అభిమానులు ముచ్చ‌టించుకున్నారు. కాని ఈ మూడింట్లో ఓ సినిమా ఆగ‌స్ట్‌లో విడుద‌ల కానున్న‌ట్టు కొద్ది సేప‌టి క్రిత‌మే ప్ర‌క‌టించారు.

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ ఈ మ‌ధ్య స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే కాన్సెప్ట్‌ల‌తో సినిమాలు తీస్తూ అంద‌రిచే ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్‌క‌థా, ప్యాడ్‌మాన్‌ వంటి చిత్రాలు తీసిన అక్ష‌య్ ప్ర‌స్తుతం గోల్డ్‌, కేస‌రి సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. గోల్డ్ సినిమా ఒలంపిక్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతుండ‌గా , ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ చిత్రం జన‌వ‌రి 26, 2019న విడుద‌ల అవుతుంద‌ని కొన్నాళ్ళుగా వార్త‌లు వ‌చ్చిన చివ‌రికి ఆగ‌స్ట్ 15న‌ మూవీ విడుద‌ల‌కి ప్లాన్ చేశాడు అక్ష‌య్. కొత్త పోస్ట‌ర్ ద్వారా మూవీ రిలీజ్ డేట్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు.

జ‌న‌వ‌రి రేస్ నుండి అక్ష‌య్ ప‌క్కకి తొల‌గ‌డంతో శంక‌ర్ అద్భుత సృష్టి 2.ఓ, వికాస్‌ బాల్‌ దర్శకత్వంలో బీహార్‌ గణిత శాస్త్రవేత్త ఆనంద్‌కుమార్‌ జీవితం ఆధారంగా హృతిక్ రోష‌న్ చేస్తున్న బ‌యోపిక్ సూప‌ర్ 30 చిత్రాల మ‌ధ్య బిగ్ ఫైట్ ఉంటుంద‌ని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. అయితే ఆగ‌స్ట్‌లో విడుద‌ల కానున్న‌ అక్ష‌య్ చిత్రానికి పోటీగా క్రిష్ తెర‌కెక్కిస్తున్న మ‌ణిక‌ర్ణిక విడుద‌ల కానుంద‌ని బాలీవుడ్ టాక్‌. కంగనా ప్ర‌ధాన పాత్ర‌లో ఝాన్సీ ల‌క్ష్మీబాయి జీవిత నేప‌థ్యంతో తెర‌కెక్కుతున్న మ‌ణిక‌ర్ణిక ఇటీవ‌ల షూటింగ్ పూర్తి చేసుకొని ఆగ‌స్ట్ 15న రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంద‌ని టాక్‌.

మ‌రి మ‌ణిక‌ర్ణిక‌, గోల్డ్ చిత్రాలు రెండు కూడా మంచి ఇంట్రెస్టింగ్ కాన్పెప్ట్‌తో రూపొందుతుండ‌గా, ఈ రెండు ఒకే రోజు విడుద‌లైతే వ‌సూళ్ళు కాస్త డ్రాప్ అయ్యే చాన్స్ ఉంద‌ని నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలో ద‌ర్శ‌కుడు క్రిష్‌తో సంప్ర‌దింపులు జ‌రిపి మ‌ణిక‌ర్ణిక మూవీని కాస్త ముందుకు కాని వెనుక‌కి కాని జ‌రుపుకోమ‌ని గోల్డ్ చిత్రాల నిర్మాత‌లు చెప్తార‌నే టాక్ వినిపిస్తుంది. అక్ష‌య్ న‌టించిన గబ్బర్‌ చిత్రానికి పని చేసిన క్రిష్‌.. మణికర్ణికకు దర్శకుడు కావటం, వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండటంతో క్రిష్ మ‌ణిక‌ర్ణిక మూవీని పోస్ట్ పోన్ చేసుకునే చాన్స్ కూడా ఉంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు . ఆ మ‌ధ్య సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కించిన ప‌ద్మావ‌త్ సినిమా కోసం జ‌న‌వ‌రి 25న రిలీజ్ కావ‌ల‌సిన త‌న ప్యాడ్‌మాన్ చిత్రాన్ని అక్ష‌య్ ఫిబ్ర‌వ‌రి 9న రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే.


2700
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles