ఇటీవల చారిత్రాత్మక చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న క్రిష్ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్‌ని తెరకెక్కిస్తున్నాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన మణికర్ణిక చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్‌తో బిజీగా ఉన్న క్రిష్ తొలి షెడ్యూల్లో బాలయ్యపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. చిత్రంలో బాలకృష్ణతో పాటు విద్యాబాలన్, మోహన్ బాబు, రానా, కీర్తి సురేష్ తదితరులు నటిస్తుండగా.. రకుల్‌ప్రీత్ సింగ్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తుందని అంటున్నారు. త్వరలో వీరు కూడా టీంతో కలవనున్నారు. అయితే ఎన్టీఆర్ సెట్లో ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు ప్రత్యక్షం కావడంతో ఆనందభరితుడైన క్రిష్ తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నాడు. ఎన్టీఆర్ సెట్లో లెజండరీ రామోజీరావుగారిని కలవడం జీవితంలో మరచిపోలేని విషయం. అతనిని చూసి యూనిట్ అంతా ఆశ్చర్యానికి గురైంది. సెట్స్‌లో రామోజీరావుగారితో అరగంట సేపు గడిపే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయనకి నా ధన్యవాదాలు అని తెలియజేస్తూ రామోజీరావుతో దిగిన ఫోటోని షేర్ చేశాడు క్రిష్. ఎన్టీఆర్ చిత్రం జనవరి 9న విడుదల కానున్న సంగతి తెలిసిందే.