స‌క్సెస్ ఫుల్ ఉమెన్‌కి ఈ సాంగ్ అంకితం

Tue,August 27, 2019 11:06 AM
Kousalya Krishnamurthy  Repati Kala Song Promo

క్రికెట్‌ పురుషుల ఆట అని భావించే ఈ రోజుల్లో ఒక యువతి తన చిన్ననాటి కలని సాకారం చేసుకుని తండ్రి కళ్లల్లో ఆనందం చూసేందుకు ఏమి చేసింది అనే దానిని కౌసల్య కృష్ణమూర్తి చిత్రంలో చూపించారు మేక‌ర్స్‌. ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లైన కౌస‌ల్య కృష్ణ‌మూర్తి చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి క‌లెక్ష‌న్స్ సాధించ‌డ‌మే కాకుండా ప‌లువురు ప్ర‌ముఖుల నుండి ప్ర‌శంస‌లు అందుకుంది. ఐశ్వర్య రాజేష్‌, రాజేంద్రప్రసాద్‌, శివకార్తికేయన్‌, ఝాన్సీ, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌, సి.వి.ఎల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని భీమినేని శ్రీనివాస‌రావు తెర‌కెక్కించారు. తాజాగా చిత్రం నుండి రేప‌టి క‌ల అనే వీడియో సాంగ్ విడుద‌ల చేశారు. ఈ సాంగ్ ని దేశం కోసం నిలబడే ప్రతి విజయవంతమైన మహిళలకు అంకితం చేస్తున్న‌ట్టు చిత్ర‌బృందం పేర్కొంది.

774
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles