దేవాల‌యాల నేప‌థ్యంలో చిరు 152వ చిత్రం..!

Tue,October 15, 2019 01:32 PM

ఖైదీ నెం 150 చిత్రంతో వెండితెర రీ ఎంట్రీ ఇచ్చిన చిరు సినిమాల స్పీడ్ పెంచాడు. రీసెంట్‌గా సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గ‌ర మంచి విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న త‌న 152వ చిత్రం కోసం స‌న్నాహాలు చేసుకుంటున్నాడు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటున్న ఈ చిత్రం అతి త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. చిరు 152వ చిత్రం సోషియో థీమ్‌తో తెర‌కెక్కనుంద‌ని, ఎండోమెంట్స్ విభాగం మరియు దేవాలయాల నిర్లక్ష్యం సమాజంపై ఎంత చెడు ప్ర‌భావం చూపుతాయో ఈ సినిమా ద్వారా చూపించ‌నున్నార‌ట‌. చిరు దేవాదయ ధర్మా దయ శాఖలో పనిచేసే ఉద్యోగిగా కనిపిస్తారని టాక్ . అంతేకాదు ఆలయ భూములను ఆక్రమించటానికి ప్రయత్నించే వారిపై అతను ఎలా చర్యలు తీసుకుంటాడు అనేది ఈ చిత్రానికి ప్రధాన కథాంశంగా తెలుస్తుంది. మ‌రి ఈ వార్త‌లో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

2973
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles