కొర‌టాల నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవ‌రితోనో తెలుసా ?

Tue,May 22, 2018 08:51 AM
koratala next works with chiranjeevi

ర‌చ‌యిత నుండి ద‌ర్శ‌కుడిగా మారి కేవ‌లం క‌మ‌ర్షియ‌ల్‌గానే కాకుండా మంచి సందేశం ఉన్న సినిమాల‌ని తీస్తూ ప్రేక్ష‌కుల‌ని ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తున్న ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ. స్టార్ హీరోలు సైతం ఇప్పుడు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ అయిన చేయాల‌ని భావిస్తున్నారు. ఇటీవ‌ల భ‌ర‌త్ అనే నేను చిత్రంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ హిట్ కొట్టిన కొర‌టాల శివ త‌న త‌దుపరి సినిమాకి సంబంధించిన ప‌నులు మొద‌లు పెట్టేశాడ‌ట‌. అయితే ఏ హీరోతో కొర‌టాల సినిమా ఉంటుందని అభిమానుల‌లో ప‌లు ఆలోచ‌న‌లు మెదులుతుండ‌గా, మెగాస్టార్ చిరంజీవితో త‌న త‌దుప‌రి సినిమా చేయ‌నున్నాడ‌నే వార్త ఫిలింన‌గ‌ర్‌లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇప్ప‌టికే చిరుతో క‌థ‌, క‌థ‌నాల గురించి చ‌ర్చ‌లు జ‌రిపార‌ట‌. ఈ మూవీ కూడా సందేశాత్మ‌క విలువ‌ల‌తో కూడిన చిత్రంగా ఉంటుంద‌ని స‌మాచారం. ఫిబ్ర‌వ‌రిలో ఈ మూవీ సెట్స్ పైకి వెళుతుంద‌ని అంటున్నారు. చిరు ప్ర‌స్తుతం సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సైరా మూవీ చేస్తుండ‌గా, ఫిబ్ర‌వరి లోపు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంద‌ట‌. ఆ వెంట‌నే కొర‌టాల టీంతో క‌లిసి వాణిజ్య విలువ‌ల‌తో పాటు మంచి సందేశం ఉన్న సినిమాని తెలుగు ప్రేక్ష‌కుల‌కి అందించ‌నున్నాడు చిరు . మ‌రి దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న ఎప్పుడు విడుద‌ల అవుతుందో చూడాలి.

3010
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles