తిత్లీ బాధితుల‌కి కొర‌టాల సాయం

Sat,October 20, 2018 10:19 AM
koratal siva gives a fund to ap cm

తిత్లీ తుపాను శ్రీకాకుళం, విజ‌య న‌గ‌రం జిల్లాల‌లో ఎంత బీభ‌త్సం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తుపాను ధాటికి అత‌లాకుత‌ల‌మైన సిక్కోలు వాసుల‌కి అండ‌గా నిలిచేందుకు సినీ ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన పలువురు ప్రముఖులు ఆర్ధిక సాయం అంద‌జేస్తున్నారు. ఎన్టీఆర్‌, వ‌రుణ్ తేజ్, క‌ళ్యాణ్ రామ్‌, సంపూర్ణేష్ బాబు, నిఖిల్, కార్తికేయ‌ త‌దిత‌రులు కొంత‌ న‌గ‌దుని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ముఖ్య‌మంత్రి స‌హాయనిధికి అందజేశారు. తాజాగా తితిలీ తుపానుతో నష్టపోయిన ఉత్తరాంధ్రకు ఆర్థిక సాయం ప్రకటించారు కొర‌టాల శివ‌ . తాను సీఎం సహాయనిధికి రూ. 3 లక్షలు విరాళం అందించిన‌ట్టు త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. తుపాను వ‌ల‌న నిరాశ్ర‌యుల‌యిన వారు త్వ‌ర‌గా కోలుకొని వారి జీవితాన్ని పున‌ర్నిర్మించుకోవాల‌ని తాను కోరుకుంటున్న‌ట్టు కొర‌టాల స్ప‌ష్టం చేశారు. కొర‌టాల త్వ‌ర‌లో మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం. దీనిపై అతి త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది.


1671
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles