ఎన్టీఆర్ కి ఎలాంటి ప్రమాదం జరగలేదు : పీఆర్ఓ

Tue,March 13, 2018 04:17 PM
ఎన్టీఆర్ కి ఎలాంటి ప్రమాదం జరగలేదు : పీఆర్ఓ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల చరణ్ తో కలిసి అమెరికాలోని లాస్ ఏంజెల్స్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. రాజమౌళి నిర్వహించనున్న వర్క్ షాప్ కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ లు అమెరికా వెళ్ళారని, అక్కడే ఎన్టీఆర్ , రామ్ చరణ్ లపై ఫోటో షూట్ కూడా చేస్తారని ప్రచారం జరిగింది. ఈ ఫోటోలని సినిమా ఎనౌన్స్ మెంట్ టైంలో విడుదల చేస్తారని అన్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కాని ఎన్టీఆర్ అమెరికా వెళ్ళి కొద్ది రోజులు అయిందో లేదో సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు అత్యుత్సాహం ప్రదర్శించి ఇటు అభిమానులని, అటు ఎన్టీఆర్ సన్నిహితులని ఆందోళనకి గురి చేశారు. అమెరికాలో ఎన్టీఆర్ కి ప్రమాదం జరిగిందని యూట్యూబ్ లోను పలు వీడియోలు చక్కర్లు కొడుతుండడంతో ఎన్టీఆర్ పీ ఆర్ ఓ, నిర్మాత మహేష్ కోనేరు ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఎన్టీఆర్ కి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆయన క్షేమంగా ఉన్నారు. త్వరలోనే హైదరాబాద్ కి రానున్నారు. సాలిడ్ ఫిజిక్ తో ఆయన తదుపరి సినిమాకి సిద్ధం అవుతున్నారని ట్వీట్ చేశాడు. దీంతో పుకార్లకి బ్రేక్ పడింది. జూనియర్ ఎన్టీఆర్ ఈ నెలలోనే త్రివిక్రమ్ తో కలిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయనుండగా, ఆ తర్వాత ఆగస్ట్ లో రాజమౌళి సినిమా కూడా చేయనున్నాడని సమాచారం.


2399

More News

VIRAL NEWS