హైదరాబాద్‌లో కొండారెడ్డి బురుజు..!

Mon,August 26, 2019 12:09 PM

హైదరాబాద్: ఇదేంటి కొండారెడ్డి బురుజు కర్నూలులో కదా ఉండాల్సింది. మరి హైదరాబాద్‌లో ఉండడమేంటని ఆశ్యర్యపోతున్నారా.. వివరాల్లోకి వెళ్తే సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా, రష్మిక మందనా హీరోయిన్‌గా అనిల్ రావిపూడి దర్శకత్వంతో సరిలేరునీకెవ్వరు అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దిల్ రాజు, అనిల్ సుంకర, మహేశ్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాలో కొండారెడ్డి బురుజు ప్రాతంలో కీలక ఘట్టాలను చిత్రీకరించాల్సి ఉంది. అయితే, భద్రతా కారణాల రీత్యా, ప్రజలకు కూడా ఇబ్బంది కలగకూడదనే ఉద్ధేశ్యంతో ఈ బురుజు సెట్‌ను హైదరాబాద్‌లో 4కోట్ల వ్యయంతో రూపొందించారు. ఈ సెట్‌లో మహేశ్‌బాబు, రాజేంద్రప్రసాద్ మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.


గతంలో ఒక్కడు సినిమాలో మహేశ్‌బాబు, ప్రకాశ్‌రాజ్(ఓబుల్ రెడ్డి) మధ్య కొండారెడ్డి బురుజు సెంటర్‌లో తీసిన ఫైట్, కొన్ని సన్నివేశాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కాగా, సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారని టాలీవుడ్ టాక్.


2744
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles