ఆత్మ‌హ‌త్య చేసుకున్న నిర్మాత ..సానుభూతి తెలిపిన కోలీవుడ్

Wed,November 22, 2017 12:28 PM
kollywood producer died

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, న‌టుడు శ‌శికుమార్‌కి ద‌గ్గ‌ర బంధువు అయిన సినీ నిర్మాత అశోక్‌( 40) నిన్న సాయంత్రం ఉరి వేసుకొని ఆత్మ‌హ‌త్య‌కి పాల్ప‌డ్డారు. ఆర్కాడు రోడ్డు వ‌ల్ప‌ర‌వాక్కం ప్రాంతంలో ఉంటున్న ఈయ‌న అప్పుల ఊబిలో కూరుకుపోవ‌డంతోనే ఆత్మ‌హ‌త్య చేసుకొని ఉంటాడ‌ని అంటున్నారు. ప‌లు సినిమాల‌కి స‌హా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన అశోక్‌కి అప్పిచ్చిన‌వారి నుండి వేధింపులు ఎక్కువ కావ‌డంతో బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డి ఉంటార‌ని స‌న్నిహితులు చెబుతున్నారు. ఆయ‌న మృతి ప‌ట్ల కోలీవుడ్ సినీ పరిశ్ర‌మ సంతాపం వ్య‌క్తం చేస్తూ , ఆయ‌న ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని కోరారు. ఇక ప్ర‌ముఖ న‌టుడు సిద్ధార్ద్ త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా .. రైత‌న్న కాని , మ‌రో నిర్మాత కానీ ఇలా ఆత్మ‌హ‌త్య చేసుకొని చ‌నిపోకూడ‌ద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. యువ నిర్మాత అప్పుల కార‌ణంగా ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం విన‌డానికి బాధ‌గా ఉంది. తమిళ్ సినిమా పూర్తిగా అప్పుల్లో ఉంది కానీ ప్రపంచమంతా సక్సెస్.. ఫేమ్ గురించి అబద్ధం చెప్తున్నామని భావిస్తోంది. ఈ సిస్టమ్ మారాలి. శ‌శికుమార్ కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాన‌ని సిద్ధార్ద్ అన్నారు.2392
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles