రకుల్ పై ప్రేమ కురిపిస్తున్న కోలీవుడ్

Sun,September 24, 2017 01:07 PM
kollywood hereos shows their interest on rakul

టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్న రకుల్ ఈ మధ్య వరుస విజయాలు సాధిస్తూ జెట్ స్పీడ్ తో దూసుకెళుతుంది. ప్రస్తుతం స్పైడర్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న రకుల్ , తమిళంలో కార్తీ సరసన ఓ చిత్రం, హిందీలో ఓ మూవీ చేస్తుంది. కార్తీ నటిస్తున్న తీరన్ అధిగారం ఒండ్రు సినిమాలో రకుల్ పేద యువతి పాత్ర చేస్తుంది. ఇది తనకు ఎంతో పేరు తెస్తుందని అంటున్నారు. ఇక హిందీలో సిద్ధార్ద్‌ మల్హోత్రా సరసన అయ్యారీ అనే సినిమా చేస్తుంది. ఢిల్లీలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది.

రకుల్ నటించిన స్పైడర్ చిత్రం ఇటు తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుండగా, ఈ సినిమాతో రకుల్ కి తమిళ అభిమానుల ఫ్యాన్‌ ఫాలోయింగ్ విపరీతంగా పెరగనుందని తెలుస్తుంది. ఇక కోలీవుడ్ హీరోలు కూడా ఆమెతో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపెడుతున్నారని టాక్. తమిళ హీరో విశాల్ తో రకుల్ ఓ సినిమా చేయాల్సి ఉండగా, డేట్స్ అడ్జెస్ట్ చేయలేక అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చిందట. కాని విశాల్ తనతో సినిమా చేయాలని భావించి వీలున్నప్పుడే డేట్స్ అడ్జెస్ట్ చేయమని అడిగాడని కోలీవుడ్ టాక్.

1594
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS