న‌య‌న‌తార ‘కొలైవుదిర్ కాలమ్’ మూవీ ట్రైల‌ర్ విడుద‌ల‌

Sun,March 24, 2019 09:52 AM

సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్ లలో ఒకరిగా ఉన్న నయన తార ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె న‌టించిన‌ త‌మిళ చిత్రం ‘ఇమైక్క నోడిగల్’ తెలుగులో ‘అంజలి సీబీఐ ఆఫీసర్’ పేరుతో ఇటీవ‌ల విడుద‌లైంది. ఈ చిత్రానికి మంచి ఆద‌ర‌ణ ల‌బించింది. ప్ర‌స్తుతం సైరా చిత్రంతో పాటు ఐరా అనే చిత్రంతో బిజీగా ఉంది. కోటపాటి రాజేష్ నిర్మాతగా సర్జన్ కె.ఎమ్ దర్శకత్వంలో ఐరా మూవీ తెరకెక్కుతుంది. మార్చి 28న ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళంలో విడుద‌ల చేయ‌నున్నారు. మ‌రోవైపు ‘కొలైవుదిర్ కాలమ్’ అనే టైటిల్ తో తెరకెక్కనున్న మరో తమిళ చిత్రంలోను నయన కీలక పాత్ర పోషించనుంది. ఈ చిత్రంతో ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా నిర్మాతగా మారబోతుండగా, ఈనాడు, బిల్లా 2 ఫేమ్ చక్రి తోలేటి దర్శకత్వం వహిస్తున్నాడు. హరర్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం లేడి ఓరియెంటెడ్ మూవీగా ఉండనున్నట్టు సమాచారం. ఎన్నో ట‌ర్న్స్ అండ్ ట్విస్ట్ లతో ఉండ‌నున్న ఈ చిత్ర ట్రైల‌ర్ తాజాగా విడుదలైంది.ఆ ట్రైల‌ర్ మీరు చూసి ఎంజాయ్ చేయండి.


1219
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles