బిచ్చ‌గాడు హీరో మ‌రో సినిమా మొద‌లు పెట్టేశాడు

Wed,June 6, 2018 10:27 AM
Kolaigaran  movie gets expectations

బిచ్చ‌గాడు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన హీరో విజ‌య్ ఆంటోని. ఈ సినిమా త‌ర్వాత ప‌లు చిత్రాల‌ని ప్రేక్ష‌కుల‌కి ముందు తీసుకు వ‌చ్చిన విజ‌య్ ఆంటోని పెద్ద‌గా స‌క్సెస్ సాధించ‌లేక‌పోయాడు. అయిన‌ప్ప‌టికి ఓటమికి వెనుక‌డుగు వేయ‌కుండా వ‌రుస సినిమాల‌తో దూసుకెళుతున్నాడు. బిచ్చగాడు తర్వాత బేతాళుడు,యమన్, ఇంద్రసేన అనే చిత్రాలతో విజయ్ ఆంటోని ప్రేక్షకుల ముందుకు రాగా, ఇవి అభిమానులని అంతగా అలరించలేకపోయాయి. రీసెంట్ గా కాశీ అనే మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. తెలుగులో కాశీ అనే టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రం తమిళంలో కాళి పేరుతో విడుద‌లైంది. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది.

విజ‌య్ ఆంటోని ప్ర‌స్తుతం రోష‌గాడు(త‌మిళంలో ‘తిమిరు పిడిచ్చవన్‌’) అనే సినిమా చేస్తున్నాడు. గ‌ణేశ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని విజ‌య్ ఆంటోని భార్య ఫాతిమా హోమ్ బేన‌ర్‌పై నిర్మిస్తుంది. ఈ చిత్రంతో పాటు అమ్మ క్రియేష‌న్స్ బేన‌ర్‌పై టీ శివ నిర్మాణంలో ఓ చిత్రం, ‘తిరుడన్‌’ అనే మ‌రో చిత్రం చేయ‌నున్నాడు విజయ్‌ ఆంటోని. ఇక తాజాగా త‌న మరో సినిమా మొద‌లు పెట్టేశాడు. కొలైకార‌న్ అనే టైటిల్‌తో తెరకెక్క‌నున్న ఈ చిత్రం ఆండ్రూ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నుంది. దియా మూవీస్‌ బ్యానరులోని ఈ సినిమాలో అర్జున్‌ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఆషిమా నర్వాల్‌ కథానాయికగా నటిస్తోంది. నాజర్‌, సీత, వీటీవీ గణేశ్‌లు నటిస్తున్నారు. ఇందులో విజ‌య్ ఆంటోని నెగెటివ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు టాక్.

2462
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles