విజ‌య్- అర్జున్ మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Wed,March 6, 2019 08:11 AM
Kolaigaran movie first look released

బిచ్చ‌గాడు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన హీరో విజ‌య్ ఆంటోని. ఈ సినిమా త‌ర్వాత ప‌లు చిత్రాల‌ని ప్రేక్ష‌కుల‌కి ముందు తీసుకు వ‌చ్చిన విజ‌య్ ఆంటోని పెద్ద‌గా స‌క్సెస్ సాధించ‌లేక‌పోయాడు. అయిన‌ప్ప‌టికి ఓటమికి వెనుక‌డుగు వేయ‌కుండా వ‌రుస సినిమాల‌తో దూసుకెళుతున్నాడు. బిచ్చగాడు తర్వాత బేతాళుడు,యమన్, ఇంద్రసేన అనే చిత్రాలతో విజయ్ ఆంటోని ప్రేక్షకుల ముందుకు రాగా, ఇవి అభిమానులని అంతగా అలరించలేకపోయాయి. రీసెంట్ గా కాశీ అనే మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. తెలుగులో కాశీ అనే టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రం తమిళంలో కాళి పేరుతో విడుద‌లైంది. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే ప్ర‌స్తుతం కొలైకార‌న్ అనే టైటిల్‌తో తెరకెక్క‌నున్న చిత్రంలో న‌టిస్తున్నాడు. ఆండ్రూ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొంద‌నుంది. దియా మూవీస్‌ బ్యానరులోని ఈ సినిమాలో అర్జున్‌ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఆషిమా నర్వాల్‌ కథానాయికగా నటిస్తోంది. నాజర్‌, సీత, వీటీవీ గణేశ్‌లు నటిస్తున్నారు. ఇందులో విజ‌య్ ఆంటోని నెగెటివ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు టాక్‌. తాజాగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుంది.

2629
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles