కోలుకుంటున్న కోడి రామ‌కృష్ణ‌..!

Fri,February 22, 2019 10:00 AM
kodi ramakrishna health in normal state

90ల‌లో ఎన్నో హిట్ చిత్రాలు తెర‌కెక్కించిన కోడి రామ‌కృష్ణ గురువారం అస్వ‌స్థ‌త‌కి గుర‌య్యారు. వెంట‌నే ఆయ‌న‌ని గ‌చ్చిబౌలిలోని ఏఐజి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ప్ర‌స్తుతం కోడి రామ‌కృష్ణ ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని, ఆయ‌న నిదానంగా కోలుకుంటున్నార‌ని వైద్యులు తెలిపార‌ట‌. టాలీవుడ్‌లో స్టార్ హీరోలంద‌రితో సినిమాలు తీసిన కోడి రామ‌కృష్ణ చివ‌రిగా క‌న్న‌డ భాష‌లో నాగ‌హ‌రవు అనే చిత్రాన్ని తీసాడు. ఈ సినిమా 2016లో విడుద‌లైంది.

కొన్నేళ్ల క్రితం కోడి రామకృష్ణ హార్ట్ అటాక్, పక్షవాతానికి గురయ్యారు. ఆ సమయంలో సరైన చికిత్స వలన వెంట‌నే కోలుకున్నారు. 1982లో చిరంజీవి నటించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంతో కోడి రామకృష్ణ దర్శకుడిగా మారారు. తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో ఇప్పటివరకు ఆయన 100కు పైగా చిత్రాలకు దర్శత్వం వహించారు. టెక్నాల‌జీ స‌రిగా లేని రోజుల‌లో కోడి రామ‌కృష్ణ అమ్మోరు, దేవి, అరుంధ‌తి, అంజి వంటి ఫాంటసీ, నాచుర‌ల్ చిత్రాల‌ని తెర‌కెక్కించి ఆడియ‌న్స్‌కి మంచి వినోదాన్ని అందించాడు. కోడి రామకృష్ణ నటుడిగా కూడా దొంగాట, అత్తగారూ స్వాగతం లాంటి చిత్రాల్లో నటించారు.

1945
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles