కాసేప‌ట్లో ఫిల్మ్ ఛాంబ‌ర్‌కి కోడి రామ‌కృష్ణ భౌతిక కాయం

Sat,February 23, 2019 11:20 AM
Kodi Ramakrishna crimission at maha prasthanam

శ‌త‌చిత్రాల ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ నిన్న మధ్యాహ్నం అనారోగ్యంతో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మృతి తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో క‌లచివేసింది. సినీ ప‌రిశ్ర‌మ‌కి చెందిన ప్ర‌ముఖులు అంద‌రు కోడి రామ‌కృష్ణ మృతికి సంతాపం తెలియ‌జేస్తూ, ఆయన ఆత్మకి శాంతి చేకూరాల‌ని ప్రార్ధించారు. అభిమానుల సంద‌ర్శ‌నార్దం కోడి రామ‌కృష్ణ భౌతిక కాయాన్ని కాసేప‌ట్లో ఫిల్మ్‌ఛాంబ‌ర్‌కి త‌ర‌లించ‌నున్నారు. ఆ త‌ర్వాత అక్క‌డి నుండి జూబ్లిహిల్స్ మ‌హాప్ర‌స్థానం వ‌ర‌కు ఆయ‌న అంతిమయాత్ర కొన‌సాగ‌నుంది. మ‌హాప్ర‌స్థానంలో కోడి రామ‌కృష్ణ అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల‌లో ఎన్నో విజ‌యవంత‌మైన చిత్రాలు చేసిన కోడి రామ‌కృష్ణ చివ‌రిగా 2016లో కన్నడ చిత్రం ‘నాగహారవు’ చేశాడు. ఆ తర్వాత ఆయన మరో చిత్రానికి దర్శకత్వం వహించలేదు.

2232
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles