సంపూ లేటెస్ట్ మూవీ టీజర్ విడుదల

Tue,May 24, 2016 07:17 AM
Kobbari Matta Telugu Movie Official Teaser

హృదయ కాలేయం చిత్రంలో తన కామెడీతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం కొబ్బరి మట్ట అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హృదయ కాలేయం టీం నుండి వస్తున్న ఈ చిత్రానికి రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వం వహిస్తున్నారు. పెదరాయుడు, ఆండ్రాయుడ్, పాపారాయిడు ఇలా మూడు విభిన్న పాత్రలలో కనిపించి సందడి చేయనున్నాడు సంపూ. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ టీజర్‌ని రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో పెదరాయుడు గెటప్‌తో కనిపించిన సంపూ ఆడవాళ్ళ గురించి చెప్పిన నాన్‌స్టాప్ డైలాగ్ అందరిని అలరిస్తోంది.

'రేయ్...కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలిసి ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే, పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి, పెరిగేసి ఎదిగేస్తున్న టైం లో తను పుట్టింది తనకోసం కాదు ఎక్కడో పుట్టిన ఎదవ కోసం అన్న విషయం తెలిసాక అమ్మా నాన్నా కలిసి పావుకిలో లడ్డూలూ, అరకిలో చేగోడీలు పెట్టి దున్నపోతులాంటి ఒక పెళ్ళికొడుకుని తీసుకొచ్చి తల దించుకొని పెళ్ళిలో, కళ్ళు దించుకొని శోభనం గదిలో పడుకుంటే గుండెలమీద తాళి బరువు, శరీరం మీద వాడి బరువు మోసీ మోసీ, వాడు వేసిన విత్తనాన్ని తొమ్మిది నెలలు మోసీ మోసి ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చి, ప్రతిరోజూ కోడికంటే ముందే నిద్రలేచి, బొట్టుపెట్టి,వాకిట్లో ముగ్గుపెట్టి, స్టవ్ మీద గిన్నె పెట్టి, అందులో పాలు మరగపెట్టి కాఫీ పొడి,టీ పొడి కలిపి పెట్టి పిల్లల నోటికి తిండి పెట్టి వాళ్ళను బడికివెళ్ళగొట్టి నిన్ను ఆఫీస్ కి తరిమికొట్టి, ఒక చేత రిమోటూ- మరోచేత కత్తిపీట పట్టుకొని ఛానెల్సు మార్చి మార్చి, కూరగాయలు తరిగీ తరిగి, పదకొండుగంటలకు మాఊరి వంట, పన్నెండు గంటలకు స్టార్ మహిళ చూస్తూ వీటి మధ్యలో వంట చేస్తూ, కూరెక్కడ మాడిపోతుందో అన్న టెన్షన్ లో బ్రేక్ మధ్యలో అత్తగారికి అన్నం పెట్టి, ముద్దమందారం, ఆడదే ఆధారం, మనసూ మమత, గోకులంలో సీత, స్వాతి చినుకులు అంటూ పగలూ రాత్రి తేడా లేకుండా సీరియల్స్ లో సమస్యల్ని తన సమస్యలుగా భావించి బరువెక్కిన గుండెతో అలిసొచ్చిన భర్తకు గుప్పెడంత మాడిపోయిన ఉప్మా పెట్టి, అప్పుడు తిని పడుకుంటుందిరా.... అదిరా ఆడదంటే అలాంటి నీ భార్యని వొదిలేస్తానంటావారా....బ్లడీ ఫూల్' అంటూ సంపూ టీజర్ లో దుమ్ము రేపాడు. మరి ఆ టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.

3456
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles