బర్నింగ్ స్టార్ 'కొబ్బ‌రి మ‌ట్ట' రిలీజ్ డేట్ వ‌చ్చేసింది

Thu,June 20, 2019 09:14 AM
kobbari Matta releasing on july 19

బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ న‌టించిన కొబ్బ‌రి మ‌ట్ట చిత్రం ఎట్ట‌కేల‌కి విడుద‌ల‌కి సిద్ధ‌మైంది. 2015లో కొబ్బరి మట్ట అనే చిత్రాన్ని మొద‌లు పెట్టిన సంగతి తెలిసిందే. ప‌లు కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ చిత్రం జూలై 19న విడుద‌ల కానుందంటూ టీం పోస్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది. హృదయ కాలేయం టీం నుండి వస్తున్న ఈ చిత్రానికి రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పెదరాయుడు, ఆండ్రాయుడ్, పాపారాయిడు ఇలా మూడు విభిన్న పాత్రలలో కనిపించి సందడి చేయనున్నాడు సంపూ. కొబ్బ‌రి మ‌ట్ట చిత్రానికి సంబంధించి గ‌తంలో ప‌లు సాంగ్స్‌, టీజ‌ర్ కూడా విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. వాటికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమా కూడా ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని టీం చెబుతుంది. ‘హృదయ కాలేయం’, ‘సింగం 123’ తర్వాత కొన్ని చిత్రాల‌లో స‌పోర్టింగ్ రోల్స్ చేసిన సంపూ ఇప్పుడు కొబ్బరి మ‌ట్ట చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మయ్యాడు.

1531
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles