'కొబ్బ‌రి మ‌ట్ట‌'తో రాబోతున్న సంపూ

Tue,July 3, 2018 12:52 PM
KOBBARI MATTA released very soon

హృదయ కాలేయం చిత్రంలో తన కామెడీతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు . ఒక్క సినిమాతో ఫుల్ పాపుల‌ర్ తెచ్చుకున్న ఆయ‌న 2016లో కొబ్బ‌రి మ‌ట్ట అనే చిత్రాన్ని చేశాడు. ఈ చిత్రానికి సంబంధించి టీజ‌ర్ కూడా విడుద‌ల చేసి, అభిమానుల‌లో అంచ‌నాలు పెంచాడు. ఈ టీజర్‌లో పెదరాయుడు గెటప్‌తో కనిపించిన సంపూ ఆడవాళ్ళ గురించి చెప్పిన నాన్‌స్టాప్ డైలాగ్ అందరిని అలరించింది. అయితే ప‌లు కార‌ణాల వ‌ల‌న చిత్ర రిలీజ్ ఆల‌స్య‌మ‌వుతూ వ‌చ్చింది. ఇక త్వ‌ర‌లోనే సినిమాని రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు హృద‌య కాలేయం ద‌ర్శ‌కుడు సాయి రాజేష్ తెలిపారు.

"ప్రతి బ్యాచిలర్ కొంపలో మందు సిట్టింగ్ కి బెస్ట్ స్టఫ్ 'కొబ్బరిమట్ట' అవబోతోంది. ఒక కొత్త రకమైన, అదేదో రకమైన సినిమాని చూసి నవ్వుకోబోతున్నారు. మాకు మీ ప్రేమ, మద్దతు కావాలి. షేర్లు, లైకులు చేస్తారు. ఎందుకంటే, బేసిక్ గా మీరు మంచోరు" అని వ్యాఖ్యానించాడు. మరో ట్వీట్ లో "ఎట్టకేలకు మేము సిద్ధమయ్యాం. సంవత్సరంన్నర కష్టం. కష్టం అనేది చిన్న మాట. నా రక్తాన్ని ధారపోశాను. ఎలాంటి క్రియేటివ్ పబ్లిసిటీ చేస్తే జనం దగ్గరకి ఈ సినిమాను తీసుకెళ్తాను... అనేది ఇప్పుడు బుర్రలో ప్రతి క్షణం తొలుస్తున్న ఆలోచన" అని రాజేష్ వ‌రుస ట్వీట్స్ ద్వారా తెలిపాడు. ఈ చిత్రానికి రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వం వహిస్తున్నారు. పెదరాయుడు, ఆండ్రాయుడ్, పాపారాయిడు ఇలా మూడు విభిన్న పాత్రలలో కనిపించి సందడి చేయనున్నాడు సంపూ. ముగ్గురు భార్యలున్న .. ఒక మనసున్న భర్త కథ కొబ్బ‌రి మ‌ట్ట చిత్రం అని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.


3502
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles