ఎట్ట‌కేల‌కు 'కొబ్బ‌రి మ‌ట్ట‌'కి మోక్షం లభించింది

Wed,June 19, 2019 08:53 AM
Kobbari Matta release date fixed

హృదయ కాలేయం చిత్రంలో తన కామెడీతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు 2015లో కొబ్బరి మట్ట అనే చిత్రాన్ని మొద‌లు పెట్టిన సంగతి తెలిసిందే. హృదయ కాలేయం టీం నుండి వస్తున్న ఈ చిత్రానికి రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పెదరాయుడు, ఆండ్రాయుడ్, పాపారాయిడు ఇలా మూడు విభిన్న పాత్రలలో కనిపించి సందడి చేయనున్నాడు సంపూ. అయితే నాలుగేళ్ళుగా బర్న్ అవుతున్న ఈ బ‌ర్నింగ్ స్టార్ జూన్ 20న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది. చిత్ర బృందం రేపు ఉద‌యం 9గం.ల‌కి రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ చేస్తామ‌ని పోస్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది. ఈ పోస్టర్‌లో సంపూ మూడు డిఫరెంట్స్ షేడ్స్‌లో కనిపిస్తూ తనదైన శైలిలో బిల్డప్ ఇస్తున్నాడు. కొబ్బ‌రి మ‌ట్ట చిత్రానికి సంబంధించి గ‌తంలో ప‌లు సాంగ్స్‌, టీజ‌ర్ కూడా విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. ఏదేమైన అన్ని స‌మ‌స్య‌ల‌ని అధిగ‌మించిన కొబ్బ‌రి మ‌ట్ట‌ చిత్రం జూన్ నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని తెలుస్తుంది. ‘హృదయ కాలేయం’, ‘సింగం 123’ తర్వాత కొన్ని చిత్రాల‌లో స‌పోర్టింగ్ రోల్స్ చేసిన సంపూ ఇప్పుడు కొబ్బరి మ‌ట్ట చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ఫుల్ ప్లెడ్జ్‌డ్‌గా అల‌రించనున్నాడు.

2715
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles