సంపూ 'కొబ్బ‌రి ఆకుల' సాంగ్ ప్రోమో విడుద‌ల‌

Sat,September 22, 2018 09:22 AM
Kobbari Aakulu Song  Promo released

హృదయ కాలేయం చిత్రంలో తన కామెడీతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ప్ర‌స్తుతం రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వంలో కొబ్బ‌రి మ‌ట్ట అనే చిత్రాన్ని చేశాడు. ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళి చాలా రోజ‌లే అయిన ఇంత వ‌ర‌కు విడుద‌ల చేయ‌లేదు. చిత్రంలో పెదరాయుడు, ఆండ్రాయుడ్, పాపారాయిడు ఇలా మూడు విభిన్న పాత్రలలో కనిపించి సందడి చేయనున్నాడు సంపూ. ముగ్గురు భార్యలున్న .. ఒక మనసున్న భర్త కథ కొబ్బ‌రి మ‌ట్ట చిత్రం అని చిత్ర యూనిట్ తెలియ‌జేయ‌గా, ఈ చిత్రం సాంగ్ టీజ‌ర్ తాజాగా విడుద‌లైంది. కొబ్బ‌రి ఆకుల సాంగ్‌లో బంధాలు, బంధుత్వాల గురించి చెబుతూ సంపూ ఫుల్ ఫ‌న్ జ‌న‌రేట్ చేస్తాడు. క‌మ్రాన్ అందించిన సంగీతం చ‌క్క‌గా ఉంది. నవంబ‌ర్ 14న చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు మేక‌ర్స్ సాంగ్ టీజ‌ర్‌లో తెలియ‌జేశారు.

1606
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles