విజేత 'కొక్కొరోకో ..' సాంగ్ విడుద‌ల‌

Fri,June 22, 2018 09:08 AM
Ko Kokkoroko Full Song With Lyrics

రాకేశ్ శ‌శి ద‌ర్వ‌క‌త్వంలో చిరు చిన్న అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ హీరోగా తెర‌కెక్కిన చిత్రం విజేత‌. వారాహి చలన చిత్రం బ్యానర్ పై ర‌జ‌నీ కొర్ర‌పాటి నిర్మించిన ఈ చిత్రం జూలైలో విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో చిత్ర యూనిట్ సినిమాపై ఆస‌క్తిని క‌లిగించేలా పోస్టర్స్‌, టీజ‌ర్స్‌, సాంగ్స్ విడుద‌ల చేస్తున్నారు. సినిమా నుండి ఇప్ప‌టికే వ‌చ్చిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్, టీజ‌ర్‌కి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక తాజాగా కోడికి సంతాపాన్ని తెలియజేస్తూ హీరో పాడే 'కొక్కొరోకో .. ' పాటని రిలీజ్ చేశారు. దీనికి కూడా సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తుంది. ఈ సాంగ్ మాస్ ప్రేక్ష‌కుల‌కి మాంచి కిక్ ఇస్తుంద‌నే చెప్ప‌వచ్చు. రామ‌జోగయ్య శాస్త్రి ఈ సాంగ్‌కి లిరిక్స్ అందించ‌గా, లోకేశ్వ‌ర్ గాత్రాన్ని అందించారు. చిత్రంలో మాళ‌విక నాయ‌ర్ కథానాయిక‌గా న‌టిస్తుంది. ఈ నెల 24వ తేదీన ఆడియో వేడుకను ఘనంగా జరపనున్నారు. చిరంజీవి ముఖ్య అతిధిగా ఆడియో వేడుక జ‌ర‌గ‌నుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. తనికెళ్ళభరణి, మురళీ శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పోసాని కృష్ణమురళి, రాజీవ్ కనకాల, జయప్రకాష్ (తమిళ నటుడు), ఆదర్ష్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రమ్ తదితరులు కీలక పాత్రలలో నటించారు. తాజాగా విడుద‌లైన సాంగ్‌పై మీరు ఓ లుక్కేయండి.

2896
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles